స్పెషల్ డెస్క్- రేణూ దేశాయ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఒకప్పటి హీరోయిన్ గానే కాకుండా పవన్ కళ్యణ్ మాజీ భార్యగా కూడా ఉందరికి తెలుసు. పవన్ తో విడిపోయాక సినిమాల్లో కూడా పెద్దగా నటించడం లేదు రేణూ దేశాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టీవ్ గా ఉంటుంది రేణూ. ఎప్పటికప్పుడు తనకు, తన పిల్లలకు సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
ఇక తాజాగా తన వ్యక్తిగతమైన ఓ అంశాన్ని నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు రేణూ దేశాయ్. తన ఆహారపు అలవాట్ల గురించి మొదటిసారి చెప్పిన రేణూ, తనకు ఇన్నాళ్లు ఇష్టమైన ఓ వంటకాన్ని తినడం ఆపేశానని తెలిపారు. అవును మాంశాహారాన్ని పూర్తిగా మానేశానని చెప్పారు రేణూ దేశాయ్. ఇకపై తాను సంపూర్ణమైన శాఖాహారినని స్పష్టం చేశారు.
ఇందుకు సంబందించి రేణూ దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ చేసిన పోస్ట్‌ను రేణూ దేశాయ్ తిరిగి షేర్ చేశారు. అలా తన అభిప్రాయాన్ని కూడా చెప్పకనే చెప్పేశారు. నేను వేగన్‌గా ఎందుకు మారిపోయాను.. ఎందుకంటే.. ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని, దాని భయం, దాని బాధ, నొప్పి ఇవన్నీ కూడా కేవలం నా పదిహేను నిమిషాల సుఖం, సంతోషానికి సరితూగదు అని తెలుసుకున్నాను అని చెప్పారు రేణూ.
అంతే కాదు, ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను.. అని తాను వెజిటేరియన్ గా మారిపోవడానికి గల కారణాన్ని వివరంగా చెప్పారు రేణూ దేశాయ్. కాసేపు నాలుకకు రుచిగా అనిపించి, మన కడుపు నిండి పదిహేను నిమిషాలు ఆనందంగా ఉండేందుకు ఓ జంతువు ప్రాణాన్ని తీసేస్తున్నాం, అది నచ్చకే మంసాహారం మానేసి, పూర్తి శాఖాహారిగా మారిపోయాను అని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. అదన్నమాట సంగతి.