స్పెషల్ డెస్క్- స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక రోజుకో కొత్త పోన్ మార్కెట్లోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏ కంపెనీ కొత్త పోన్ ను లాంచ్ చేసినా వెంటనే భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి రావాల్సిందే. రిటైల్ మార్కెట్లో భారత్ అతి పెద్ద బిజినెస్ సెంటర్ కావడంతో ప్రముఖ కంపెనీలన్నీ తమ ప్రాడక్ట్స్ ను మన దేశంలో లాంచ్ చేసేందుకు ఆసక్తి చూపుతాయి.
ఇక చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి కొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తోంది. ఈమేరకు రెడ్‌మి నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ టీజర్ ఫోటోను సంస్థ విడుదల చేసింది. అతి త్వరలో భారత్ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. కానీ ఈ ఫోన్ ను ఎప్పుడు భారత్ మార్కెట్ లోతి విడుదల చేస్తున్నది మాత్రం సంస్థ చెప్పలేదు.
రెడ్‌మి నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ను అమర్చారు.సెల్ఫీ కెమెరా, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మాక్రో సెన్సార్ ను పొందుపరిచారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, ట్రిపుల్ రియర్ కెమెరా ప్రత్యేకం. వచ్చేనెల రెడ్‌మి నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ భారత్ లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.