ఈశాన్య భారతంలో భారతదేశంలో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం… ఘర్షణలకి కారణం అయ్యింది. అస్సాం – మిజోరం రాష్ట్రాల రైతులు కర్రలతో కొట్టుకునే స్థితి నుండి.., రెండు రాష్ట్రాల పోలీసులు శత్రు దేశాల సైనికులుగా మారి.. కాల్పులు జరిపే స్థాయికి గొడవ వెళ్ళింది. ఇండియాలో భాగమైన ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ గొడవ ఈ నాటిది కాదు. బ్రిటీష్ కాలం నుండి ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే వస్తోంది.
బ్రిటిష్ ప్రభుత్వం 1857లో విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ కారణంగా.. అస్సాం లోని కాచల్ జిల్లా – మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య ఉన్న భూమిపై తమకే హక్కు ఉన్నట్టు రెండు రాష్ట్రాలు భావిస్తూ వస్తున్నాయి. ఇక్కడ నివశించే రైతులు నిత్యం ఈ భూమి కోసం ఘర్షణలకి దిగుతూ ఉంటారు. ఈసారి కూడా అలానే గొడవ మొదలైంది. కర్రలు, రాళ్లతో వీరు పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో.., రెండు వైపులా సరిహద్దుల్లో పోలీసులు మోహరించారు. కానీ.., పోలీసులు బలగాలు వచ్చాక కూడా ఘర్షణలు ఆగలేదు.
అస్సాంలో బీజేపీ ప్రభుత్వం, మిజోరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో.. అధినేతలు కూడా పంతానికి వెళ్లారు. దీంతో.., పోలీసులకి కాల్పులు జరగక తప్పలేదు. మొత్తం ఈ ఘర్షణలలో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 60 మందికి పైగా ప్రజలకి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఇదే సమయంలో ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై మరొకరు విమర్శలకి దిగారు. దీంతో.., తప్పనిసరి పరిస్థితిల్లో హోమ్ శాఖ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా.. సరిహద్దు ప్రాంతాలకు 2 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు పంపించారు. ఒకే దేశంలో భాగమైన ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంత పెద్ద సరిహద్దు వివాదం నెలకొనడం నిజంగా బాధాకరమైన విషయం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.