కారు కొనడం అనేది మీ లక్ష్యం సరే.. ఎలాంటి కారు కొంటున్నారు? ధర తక్కువ, డిస్కౌంట్ ఎక్కువగా ఉంది అని ఏ కారు పడితే ఆ కారు కొంటే మాత్రం మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. కారు కొనే సమయంలో ప్రధానం చూడాల్సింది భద్రతా ప్రమాణాలు. ఆ కారు ఎంత వరకు సేఫ్ అనేది తెలుసుకోవాలి.
కొంతమందికి కారు కొనాలి అనేది ఒక కల. అందుకోసం చాలా కష్టపడుతుంటారు. చాలా మంది అవసరం కోసం సెకండ్ హ్యాండ్స్ లో కూడా కారుని కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది తక్కువలో వస్తోందని ఏదోక కారుని కొనేస్తుంటారు. అయితే కారుని కొనే సమయంలో ఎంతో మైలేజ్ ఇస్తుంది? ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? అనే అంశాలతో పాటుగా ఆ కారు ఎంత సేఫ్? అనే ప్రశ్నను కచ్చితంగా అడగండి. చాలా కార్లకు భద్రతా ప్రమాణాల్లో జీరో రేటింగ్ కూడా ఉంది. కారు సేఫ్టీతో పనేంటి? అనుకునే వారికోసం ఇప్పుడు ఒక ఘటన గురించి చెప్పాలి. ఈ ఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఆ ప్రశ్న మల్లీ అడగరు.
విషయం ఏంటంటే.. సత్యప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి 2020లో టాటా టియాగో కారుని కొనుగోలు చేశాడు. ఆ కారును ఏ ఉద్ధేశంతో కొనుగోలు చేశాడో తెలియదు. కానీ, అతను ఆ కారుని కొన్నందుకు జీవితాంతం ఆనందిస్తాడు. ఎందుకంటే ఓ రోజు సత్యప్రకాశ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి టాటా టియాగో కారులో బయటకు వెళ్లాడు. అలా వెళ్తున్న సమయంలో రోడ్డు మీద సడెన్ గా గుంతను చూశాడు. ఇంకేముందు వేగంగా కారు స్టీరింగ్ ని తిప్పాడు. గంటకు 100 కిలోమీటర్ల వేగంలో ఉండటం వల్ల కారు నాలుగు పల్టీలు కొట్టింది. కారు పైకప్పు, అద్దాలు అన్నీ ధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో సత్యప్రకాశ్ కు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. వెంటనే అతను అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వారిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
సత్యప్రకాశ్ మిత్రులకు కూడా స్వల్ప గాయాలే అయ్యాయి. అయితే కారు ఉన్న స్థితిని చూస్తే.. కనీసం ఒక్కరైనా మరణించి ఉంటారు అనే అభిప్రాయం కలుగుతుంది. టాటా టియాగో కాకుండా మరే హ్యాచ్ బ్యాక్ కారుకి అయినా ఈ ప్రమాదం జరిగితే కచ్చితంగా ప్రాణాలు పోయుండేవని సత్యప్రకాశ్ స్వయంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా టాటా టియాగో వినియోగదారులు ఉండే గ్రూప్ లో షేర్ చేశారు. అతని తర్వాత చాలా మంది తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన కొన్ని వారాల తర్వాత సత్యప్రకాశ్ మళ్లీ అదే మోడల్, అదే కలర్ కారుని కొనుగోలు చేశాడు. న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం ప్రకారం.. హ్యాచ్ బ్యాక్ విభాగంలో టాటా టియాగో 5కి 4 స్టార్ రేటింగ్ తో అత్యుత్తమ మోడల్ గా ఉంది. కారు సేఫ్టీ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.