న్యూ ఢిల్లీ- తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు బ్రార్ స్క్యేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. రావత్, మధులిక కుమార్తెలు కీర్తిక, తరిణిలు తల్లిదండ్రుల చితికి దహన సంస్కరాలు నిర్వహించి, నిప్పంటించారు. అంతకు ముందు ఢిల్లీ కామరాజ్ మార్గ్ లోని బిపిన్ రావత్ నివాసం నుంచి బ్రార్ స్వ్కేర్ వరకూ జరిగిన అంతిమ యాత్రలో త్రివిధ దళాల అధిపతులతో పాటు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
ర్యాలీ కొనసాగినంత సేపు దారి పొడవునా ప్రజలు రావత్ ఫోటో, భారత జాతీయ పతకాన్ని చేతబట్టి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బిపిన్ రావత్, మధులిక పార్దీవ దేహాలు స్మశాన వాటికకు చేరుకున్న తర్వాత, సైన్యం 17 శతఘ్నులతో వందనం సమర్పించింది. ప్రస్తుత సీడీఎస్ బిపిన్ రావత్ ఫోర్‌స్టార్ జనరల్ గా ఉన్నారు. ఇది ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌తో సమానమైన ర్యాంక్. కానీ వీరందరిలో ఆయన ప్రథముడిగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో.. ఆయనకు 17 శతఘ్నుల వందనం సమర్పించారు.
2233 ఫీల్డ్ రెజిమెంట్ నుంచి ఇవి వచ్చాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ హోదాకు సమానమైన ఆరుగురు అధికారులు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. దేశంలోని త్రివిధ దళాల్లోని అత్యంత సీనియర్లైన 800 మంది అధికారులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఉదయం రావత్ కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అమిత్ షా, రావత్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
ఈ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మరో 11 మంది అంత్య క్రియలు సైతం పలు ప్రాంతాల్లో నిర్వహించారు. వారి వారి కుటుంబాలు, ప్రజల క్ననీటి వీడ్కోలు మధ్య వారందరికి అంతిమ యాత్రలు నిర్వహించి, దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ వీర జవానులందరికి దేశం మొత్తం జోహార్లు అర్పించి, శ్రధ్దాంజలి ఘటించింది.
#WATCH | Delhi: #CDSGeneralBipinRawat laid to final rest with full military honours, 17-gun salute. His last rites were performed along with his wife Madhulika Rawat, who too lost her life in #TamilNaduChopperCrash.
Their daughters Kritika and Tarini performed their last rites. pic.twitter.com/uTECZlIhI0
— ANI (@ANI) December 10, 2021