దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. స్మశానంలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత బయటకు పొక్కకుండా ఉండేందుకు నిందితులు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే..ఢిల్లీలోని పాతనంగల్ ప్రాంతంలో నివాసం ఉంటోంది ఓ కుటుంబం. వారి ఇంటి పక్కనే ఓ స్మశానవాటిక ఉంది. దీంతో వారికి తాగటానికి నీళ్లు లేకపోవటంతో తన కూతురిని నీటి కోసం స్మశానంలో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరకు పంపింది. ఎంత సేపటి్కి కూడా తన కూతురు రాకపోవటంతో చాలా సేపు ఎదురుచూసింది.
అంతలోనే రాధేశ్యామ్ అనే కాటికాపరి వచ్చి మీ కూతురు విద్యుత్ షాక్‌తో మరణించిందని తెలిపాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇక కాటికాపరి చెప్పిన విషయంలో నమ్మకరాకపోవడంతో బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. కాటికాపరే తన కూతురిని అత్యాచారం చేసి ఆపై కరెంట్ షాక్‌తో మరణించిందని నమ్మించేందుకు ఆపై కాల్చి చంపారని బాలిక తండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాటికాపరి సహా నలుగురుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో నిజంగానే బాలికపై అత్యాచారం జరిగిందా అనే విషయంపై రిపోట్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అనుమానాస్పద కేసు కింద దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.