సాధారణంగా మనకు ఏదైనా కావాలంటే.. లేదా మార్కెట్‌కి వెళ్లి సరుకులు, కూరగాయలు, పండ్లు తెచ్చుకోవాలంటే .. టైమ్ కి గుర్తుకు రావని ఓ పేపర్‌పై అన్ని రాసుకుంటాం. తండ్రి లేదా భర్త వచ్చిన జీతాన్ని నెలవారీ ఖర్చులు, తీర్చాల్సిన అప్పుల జాబితాను వేసుకుంటుంటారు. కానీ మనం చెప్పుకోబోయే తాత కాస్త భిన్నం.
సాధారణంగా మనం ఇంట్లోకి సరుకులు కొనేందుకు లిస్ట్ రాసుకుంటాం.. లేదా మార్కెట్‌కి వెళుతున్నామంటే ఏమేమీ తెచ్చుకోవాలో ఓ జాబితాను పేపర్‌పై రాసుకుంటాం. అటు ఇంటి పెద్దలైన భర్త, తండ్రి వచ్చిన జీతాన్ని నెలవారీ ఖర్చులు, తీర్చాల్సిన అప్పుల జాబితాను వేసుకుంటుంటారు. పిల్లల చదువులయ్యే ఫీజు ఇతరత్రా అమ్మ, నాన్నలు బేరీజు వేసుకుని ఓ లిస్ట్ తయారు చేసుకుంటారు. ఇవన్నీ ప్రతి మధ్య తరగతి కుటుంబంలో కనిపించేవి. కానీ ఏం సినిమా చూశామో, ఎన్ని చూసినిమాలు చూశామో ఎప్పుడైనా రాసుకున్నారా..ఆ అది కూడా రాస్తారా అనుకుంటున్నారా. రాస్తారండి. సినిమా లవర్స్ అని చెప్పుకుంటున్నమనకీ.. అసలైన సినిమా ప్రేమికుడైన తన తాతను పరిచయం చేశాడో మనవడు.
ఏజె అనే ట్విట్టర్ యూజర్ తన తాత చూసిన సినిమాల జాబితా అంటూ ఓ జర్నల్స్ లోని ఓ పేజీని ఫోటో తీసి నెట్టింట్లో పోస్టు చేశారు. అందులో ఫోటోలో వారి తాత చూసిన సినిమాలు, వాటి సంఖ్యతో పాటు సినిమా చూసిన తేదీ, షో టైమ్, టికెట్ కు పెట్టిన ఖర్చు అంతా జర్నల్స్ రూపంలో పొందుపరిచారండి. తాతయ్యచూసిన సినిమాల్లో ప్రాంతీయ భాషలే కాకుండా ఇంగ్లీషు మూవీస్ కూడా ఉన్నాయి. జేమ్స్ బాండ్, హిచ్ కాక్ వంటి ప్రముఖ దర్శకులు తెరకెక్కించిన సినిమాలను ఎక్కువగా చూసేవారట. అయితే ఇవన్నీ 1958 నుండి 1974 వరకు చూసిన సినిమాల జాబితాగా అని మనవడు తెలిపారు. ఆయన నమోదు చేసిన జాబితాలో మొత్తంగా 470 సినిమాలు తిలకించినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ గా మారింది. కొందరు మీ తాత అసలైన సినిమా పిచ్చోడూ అంటూ పొగిడేస్తున్నారు. అందులో ఎన్ని సినిమాలతో పాటు ఏ ఏ భాషల్లో మూవీస్ చూశారో కూడా ఆయన పేర్కొన్నారు. ఆ జాబితాలో ఆయన ప్రతి నెలా రెండు మూడు సినిమాలు చూసినట్లు కనబడుతోంది. మరికొంత మంది చాలా ఆశ్చర్యంగా ఉందని, మరికొన్ని పేజీల ఫోటోలు పెట్టాలని, వాటిని చూసేందుకు ఆసక్తితో ఉన్నట్లు మరో యూజర్ రాసుకొచ్చాడు. ప్రతి నెలా అయిన చూస్తున్న సినిమాల సంఖ్యతో తాను ఇంప్రెస్ అయ్యానంటూ మరొకరు పేర్కొన్నారు. మీకు ఇలాంటి ఆసక్తి ఉంటే ఇంకెందుకు రాసేయండి. ఈ తాత రాసుకున్న ఈ సినిమా జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Long long ago, my grandfather has created his own version of Letterboxd to keep record of the movies he had watched. I’m awestruck by the fact that he’s watched Hitchcock and James Bond films in theatres. pic.twitter.com/uiVhk7RqOY
— A K (@iamakshy_06) February 25, 2023
This is insane. Apparently, Anbe Vaa (1966) was inspired from Come September (1961) and my grandfather had watched both the films in theatres. https://t.co/jiICmE8aRq pic.twitter.com/s2legfU7yl
— A K (@iamakshy_06) February 25, 2023