ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగకు, నెలవంకకు మధ్య చాలా ముఖ్యమైన సంబంధం ఉంటుంది. రంజాన్ మాసంలో నెలవంక కనిపించిన రోజు నుంచి ఉపవాసాలు ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది నెలవంక కనిపించలేదు. మరి ఈ ఏడాది రంజాన్ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..
ముస్లింలకు రంజాన్ మాసం ఎంత పవిత్రమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది మార్చి నెలలోనే రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సాధారణంగా రంజాన్ మాసం ప్రారంభానికి, ముగింపుకు నెలవంక కనిపించడం ఎంతో ముఖ్యం. ప్రతీ ఏడాది రంజాన్ నెలవంక దర్శనం తర్వాత ఉపవాసాలు ప్రారంభించి సరిగ్గా నెలరోజులు పాటు పాటించి తర్వాత వీటిని ముగించి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో.. ఈ ఏడాది గురువారం నుంచే రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అవుతాయని భావించారు. అయితే.. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో ఈ విషయంలో సందిగ్ధత నెలకొంది. రంజాన్ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో భారతదేశంలో మార్చి 24న నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. అంతకుముందు, భారతదేశంలో రంజాన్ ప్రారంభ తేదీని ప్రకటించడానికి సెంట్రల్ రూట్-ఇ-హిలాల్ కమిటీ తన నెలవారీ సమావేశాన్ని హైదరాబాద్‌లోని అస్తానా షుతారియా దబీర్‌పురాలోని ఖాన్‌కా కమిల్‌లో నిర్వహించింది. అనంతరం మార్చి 24 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అవుతాయని ప్రకటించింది.
బుధవారం సాయంత్రం 6:30 గంటలవరకు హైదరాబాద్‌లో రూట్-ఎ-హిలాల్ కమిటీ సమావేశం జరిగింది. భారతదేశంలోని అనేక ఇతర నగరాల్లో కూడా సమావేశాలు జరిగాయి. అనంతరం చంద్రుడు కనిపించకపోవడం వల్ల రంజాన్ మాసం.. శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని.. ఈ సందర్భంగా కమిటీ ప్రకటించింది. అంతేకాక.. ఈ ఏడాది రంజాన్ మాసంలో కేవలం 29 రోజుల పాటే ఉపవాస దీక్షలు ఉంటాయిని కమిటీ పేర్కొంది. ఇక సాయంత్రం 6:00 గంటల వరకు కూడా న్యూజిలాండ్‌లో నెలవంక కనిపించలేదు. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇస్లామిక్ అసోసియేషన్స్ ఆఫ్ న్యూజిలాండ్ రంజాన్ మాసం మార్చి 24 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లుగా ధృవీకరించి.. ప్రకటించింది.
సౌదీ అరేబియాలో కూడా మంగళవారం సాయంత్రం వరకు కూడా నెలవంక కనిపించలేదు. అందువల్ల ఆ దేశంలో రంజాన్ గురువారం ప్రారంభం అయ్యింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా ఇతర మధ్యప్రాచ్య దేశాలకు కూడా ఇదే వర్తిస్తుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో రంజాన్ సందర్భంగా ఉపవాసం, ప్రార్థన , దాతృత్వ పనులు చేపడతారు. ఈ పవిత్ర మాసంలో పేదలకు సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు.
రంజాన్ చంద్రుడు కనిపించడం లేదు, భారతదేశంలోని ముస్లింలు శుక్రవారం నుండి ఉపవాస దీక్షలు.#Ramadan2023 pic.twitter.com/7R4ggTUN9k
— #PKSDT (@TheJanasainik) March 22, 2023