ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ సంచలన దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అనసరం లేదు. తన సినిమాలతో వర్మ ఎంత క్రేజ్ సంపాదించాడో.. అంత కంటే ఎక్కువ క్రేజ్ ను తన మాటలతో సొంతం చేసుకున్నాడు ఆర్జీవి. అవును రామ్ గోపాల్ వర్మ ఏంచేసినా సంచలనమే. ఆయన ఏంమాట్లాడినా అది ఆసక్తికరమే. ఆర్జీవీ సాధారనంగా ఎప్పుడు, ఎవరి మీద, ఎలాంటి కామెంట్ చేస్తాడో, ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో ఎవ్వరికి తెలియదు.
అన్నట్లు వర్మ ఈ మధ్య అల్లు అర్జున్ పుష్ప సినిమాపా వరుసగా పోస్టులు పెడుతూ వస్తున్నాడు. అల్లు అర్జున్ బాలీవుడ్ ను ఏలేశాడని, పుష్ప మూవీ బాలీవుడ్ స్టార్స్ ను షేక్ చేస్తోందని వర్మ ప్రశంసల జల్లు కురిపింంచాడు. కేవలం అల్లు అర్జన్ ను మాత్రమే పొగిడితే దాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ వర్మ బన్నీని పొగిడే సమయంలో మిగతా హీరోలపై చేసే కామెంట్స్ అసక్తి రేపుతున్నాయి.
అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ వర్మ వరుసగా ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో రిలీజ్ చేయవద్దని తాను ఎంతో చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదని చాలా సార్లు వాపోయాడు ఆర్జీవీ. ఐనా ఆ సినిమాను విడుదల చేశారు, మరి ఇప్పుడు ఏమైంది.. అంటూ రామ్ గోపాల్ వర్మమ వరుసగా ట్వీట్స్ చేశాడు.
ఇదిగో ఇప్పుడు పవన్ కళ్యణ్ తాజా సినిమా భీమ్లా నాయక్ మూవీని హిందీలో విడుదల చేయండి, కచ్చితంగా హిట్ అవుతుంది.. అంటీ వర్మ ట్వీట్లు పెడుతున్నాడు. అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అవ్వడంతో పుష్ప సినిమాపై వర్మ ఎన్నో ట్వీట్లు వేశాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ మీద పడ్డాడుప్రస్తుతం వర్మ వేసిన ట్వీట్ తో మళ్లీ బన్నీ, పవర్ స్టార్ అభిమానుల మధ్య వివాదం చలరేగేలా ఉంది.
భీమ్లా నాయక్ మూవీని హిందీలో సైతం విడుదల చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సినిమా పుష్ప కంటే పెద్దదని, పాన్ ఇండియన్ అని నిరూపించుకోగలడు అంటూ ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. వర్మ ట్వీట్ పై మేగా అభిమానులు ఆగ్రహం వ్కక్తం చేస్తున్నారు.
Greattt that Bheemla nayak is releasing in Hindi 💃and now @PawanKalyan can prove to PAN INDIA that his film is bigger than #Pushpa and he’s BIGGER than @alluarjun 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) February 16, 2022