తెలుగు రాష్ట్రాలలోని బుల్లితెర ప్రేక్షకుల ఎదురు చూపులకు బ్రేకులు వేస్తూ.., “ఎవరు మీలో కోటీశ్వరులు” కర్టన్ రైజింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయింది. జూనియర్ యన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ఫస్ట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు. మరి.., ఈ ఇద్దరు మిత్రులు ఒక చోట కలిస్తే మాటలకి కొదవ ఉంటుందా? ఈ కర్టెన్ రైజింగ్ ఎపిసోడ్ లో గేమ్ కన్నా తారక్-చరణ్ మధ్య సాగిన మాటలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఇద్దరు స్టార్స్ మనసు విప్పి మాట్లాడుకోవడంతో చాలా ఎమోషనల్ టాపిక్స్ తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే యన్టీఆర్.. పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకుని రాగ, తన బాబాయ్ గురించి చెప్తూ చరణ్ పూర్తిగా ఎమోషనల్ అయిపోయాడు.
“బాబాయ్ గురించి చెప్పమని అందరూ అడుగుతూ ఉంటారు. కానీ.., కొన్ని బంధాల గురించి చెప్తే దిష్టి తగులుద్ది. అందుకే నేను బాబాయ్ గురించి పెద్దగా బయట చెప్పను. కానీ.., అడుగుతుంది నువ్వు కాబట్టి ఈరోజు చెప్తాను” అని చరణ్ పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి ఓపెన్ అయ్యాడు.
“ఆయన పేరుకి మాత్రమే మాకు బాబాయ్. కానీ.. నన్ను, నా సిస్టర్స్ ని ఒక నాన్నలానే పెంచారు. నాన్న షూటింగ్స్ తో బిజీగా ఉన్న రోజుల్లో మా అందరికీ పవన్ బాబాయ్ తోడుగా ఉంటూ వచ్చారు. మా చదువుల దగ్గర నుంచి వ్యక్తిగత విషయాల వరకు అన్నీ కళ్యాణ్ బాబాయే చూసేవారు. నాన్న నాకు నేరుగా చెప్పలేని చాలా విషయాలను బాబాయ్ చేతే చెప్పిస్తుంటారు. అందుకే ఆయన మాకు చిన్న నాన్న లెక్క” అంటూ రామ్ చరణ్ పూర్తిగా ఎమోషనల్ అయిపోయారు.
ఇది విన్న తారక్.. భవిష్యత్ లో కూడా మీ ఇద్దరి రిలేషన్ ఇలానే బలంగా కంటిన్యూ అవ్వాలంటూ ఆకాంక్షించారు. ఏదేమైనా జూనియర్ యన్టీఆర్ కారణంగా.. రామ్ చరణ్, పవన్ మధ్య ఎంత బలమైన బాండింగ్ ఉందో అర్ధం అయ్యింది అంటూ మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మరి.., తారక్ హోస్టింగ్ పై, పవన్ కళ్యాణ్- రామ్ చరణ్ బాండింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.