ఫిల్మ్ డెస్క్- దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రజినీ అభిమానులు సైతం తలైవా బ్లాక్ బస్టర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో అన్నాత్తేగా వస్తున్నాడు. ఆ సినిమానే తెలుగులో పెద్దన్నగా వస్తోంది.
రజినీకాంత్ నుంచి ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో తెలిసిన డైరెక్టర్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో పెద్దన్న కూడా అలానే ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. పక్కా మాస్ కథతో ఫుల్ యాక్షన్ తొ రజినీ మెప్పించేందుకు వస్తున్నాడు. పెద్దన్న సినిమాలో డైలాగ్స్ రజినీ గత హిట్ సినిమాలను గుర్తుకుచేస్తున్నాయి. ఐతే కథ మాత్రం అదే పాత ధోరణిలో వెళ్లినట్టు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది.
నువ్ ఎవరన్నది నువ్ వెనకేసున్న ఆస్తిలోనో, నీ చుట్టూ ఉన్న మనిషుల్లోనూ లేదు..నువ్ చేసే చర్యల్లోనూ.. మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది.. ఇది వేదవాక్కు.. అని రజినీ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. న్యాయంగానూ ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే.. ఆ దేవుడి దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు.. అనే డైలాగ్ సైతం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ రోజు నుంచి మొదలవుతుంది జాతర.. మిఠాయి కిల్లీ.. అనే రజినీ డైలాగ్ సైతం తన స్టైల్లో చెప్పాడు.
రజినీ పెద్దన్న సినిమాలో మెయిన్ విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడు. జీవితంలో శత్రువులను ఎంతో మందిని చూశాను.. మొట్టమొదటి సారిగా నా చేత కన్నీళ్లు చిందించిన శత్రువువి నువ్.. నిన్ను అంతం చేయడం బాధ్యత కాదు.. నా హక్కు.. అని జగపతి బాబు చెప్పే డైలాగ్ విలనిజాన్ని హైలెట్ చేసింది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్‌ను ఎలివేట్ చేసేలా ఉంది. అన్నట్లు తమిళ్ లో అన్నాత్తె, తెలుగులో పెద్దన్నగా నవంబర్ 4న దీపావళి కానుకగా భారీ ఎత్తున విడుదల అవుతోంది.