నిన్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయింట్స్ కి జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ భారీ సిక్సర్ కొట్టాడు. ఎప్పటిలాగే నిదానంగా బ్యాటింగ్ చేసినా.. ఈ ఒక్క సిక్సర్ తో హైలెట్ గా మారిపోయాడు. రాహుల్ కొట్టిన ఈ సిక్స్ కి భార్య అథియా శెట్టి రియాక్షన్ చూడాల్సిందే.
ఐపీఎల్ 2023 లో లక్నో టీమ్ కి మరో విజయం దక్కింది. నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైనా.. బౌలింగ్ లో మాత్రం సమిష్టిగా రాణించింది. ఓ మాదిరి లక్ష్యాన్ని కాపాడుకొని ఈ సీజన్ లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది బ్యాటింగ్ లో మరోసారి స్లోగా ఆడిన రాహుల్.. కెప్టెన్సీ విషయంలో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. నిన్న మ్యాచ్ లో రాహుల్ కొట్టిన ఒక సిక్స్ కి భార్య అథియా శెట్టి ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.
జైపూర్ వేదికగా నిన్న ఐపీఎల్ లో రాజస్థాన్, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఫోర్లు, సిక్సులు కరువైన ఈ మ్యాచ్ లో రాహుల్ కొట్టిన ఒక సిక్స్ లక్నో ఇన్నింగ్స్ లో హైలెట్ గా మారింది. 9 ఓవర్లో స్పిన్నర్ చాహల్ బౌలింగ్ లో 103 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. రాహుల్ ఆడిన ఈ స్లాగ్ స్వీప్ దాదాపు గ్రౌండ్ దాటి వెళ్ళిపోయింది. ఈ సిక్స్ కి రాహుల్ ఫ్యాన్స్ సంబరాలు చేకుంటుంటే.. మ్యాచ్ చూడడానికి వచ్చిన అథియా శర్మ చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇలాంటి సిక్స్ కొట్టడం నా భర్తకే సాధ్యం అనేలా రియాక్షన్ ఇచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 154 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ స్కోర్ వేగం పెరగలేదు. మేయర్స్ (51) అర్ధ సెంచరీ చేయగా.. కెప్టెన్ రాహుల్, పూరన్ , స్తోయినిస్ పర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ రాజస్థాన్ రాయల్స్ కి మంచి ఆరంభమే ఇచ్చినా..మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో గెలిచే మ్యాచ్ ని చేజేతులా పోగొట్టుకుంది. లక్నో బౌలర్లు చివరి 7 ఓవర్లు బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పాటుగా రాహుల్ కెప్టెన్సీ కూడా లక్నో విజయంలో కీలక పాత్ర పోషించింది. మొత్తానికి రాహుల్ కొట్టిన సిక్స్ కి అథియా శెట్టి రియాక్షన్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.