విరాట్ కోహ్లీ హోటల్ గదికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. హోటల్ స్టాఫ్ విరాట్ గదిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ విషయంపై కోహ్లీ కూడా తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడం చూశాం. డేవిడ్ వార్నర్ లాంటి ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం విరాట్‌కు మద్దతుగా నిలిచారు. ఇటు బీసీసీఐ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదని.. హోటల్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసింది. వారు సంబంధిత వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలిగించారు కూడా. అయితే బీసీసీఐ ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేద్దానగా.. అందుకు కోహ్లీ నిరాకరించాడు. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామంటూ వారించాడు.
ఇదే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా స్పందించాడు. ఈ హోటల్ గది వ్యవహారాన్ని ద్రవిడ్ తీవ్రంగా ఖండించాడు. “కోహ్లీ గదిని వీడియో తీసి వైరల్ చేశారనే వార్త నన్ను ఎంతో బాధించింది. ఎందుకంటే మీడియా, ఫ్యాన్స్, ఫొటోగ్రాఫర్ల నుంచి దూరంగా.. ప్రశాంతంగా, సురక్షితంగా భావించేది హోటల్ గది మాత్రమే. అలాంటిది గదిలోకి కూడా ఇలా కెమెరాలు తీసుకొచ్చి వీడియోలు తీయడం హర్షించదగ్గ విషయం కాదు. విరాట్ కూడా ఈ వ్యవహారంపై సరిగ్గా స్పందించాడు. ఒక్క విరాట్ కోహ్లీకే కాదు అందరికీ ఇలాంటి ఘటనలు ఎంతో అసౌకర్యాన్ని, అభద్రతను కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలు మరెవరికీ జరగకూడదు. ఈ విషయంపై హోట్ల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాం. వాళ్లు సంబంధిత వ్యక్తులపై చర్యలు కూడా తీసుకున్నారు. అంటూ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
Virat Kohli & Rahul Dravid during the practice session. pic.twitter.com/crbEYTmpPh
— Johns. (@CricCrazyJohns) November 1, 2022
అటు కేఎల్ రాహుల్‌పై వస్తున్న విమర్శలు, అతడని జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లపై కూడా ద్రవిడ్ స్పందించాడు. “టీ20 మ్యాచ్‌లంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇంక మెగాటోర్నీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లను ఎదుర్కొని అర్ధ శతకాలు నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ రాబోయే మ్యాచుల్లో కచ్చితంగా తిరిగి ఫామ్ లోకి వస్తాడని మేం గట్టిగా నమ్ముతున్నాం. అతని రికార్డులు చూస్తేనే ఎంత గొప్ప ఆటగాడో అర్థమవుతుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులకు కేఎల్ రాహుల్ బాగా సెట్ అవుతాడు. రాహుల్ నుంచి టీమ్ కు ఏం కావాలి అనే దానిపై అతనికి మాకు పూర్తి స్పష్టత ఉంది” అంటూ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
Rahul Dravid said “Virat Kohli is fine, he has dealt with the incident well and training as well”.
— Johns. (@CricCrazyJohns) November 1, 2022
Rahul Dravid said “Me & Rohit dont have absolutely no doubt who will open, I know how much impact KL Rahul can make”.
— Johns. (@CricCrazyJohns) November 1, 2022