ఫిల్మ్ డెస్క్- ఆర్ నారాయణ మూర్తి గురించి అందరికి తెలిసిందే. ఆయన విప్లవ సినిమాలు మాత్రమే తీస్తారు.. కానీ ఆయన మాటల్లో మాత్రం చాలా గాంభీర్యం ఉంటుంది. మనసుకు ఏది అనిపిస్తే అది నిస్సందేహంగా చెప్పేస్తుంటారు ఆర్ నారాయణ మూర్తి. నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కలిసి నటించిన బంగార్రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఈ క్రమంలో బంగార్రాజు యూనిట్ రాజమండ్రిలో మంగళవారం బ్లాక్ బస్టర్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ స్టేజ్ మీద ఆర్ నారాయణ మూర్తి అందరినీ సరదాగా రఫ్పాడించారు. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానిని. ఆయన చిరునవ్వు, ఆయన ఆశీస్సుల వల్లే ఈ సినిమా హిట్ అయింది అని చెప్పారు.
అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మ.. నాగార్జున, నాగ చైతన్యలోకి వచ్చింది. అందుకే ఈ సినిమా హిట్ అయింది. 2022లో సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టి ఆడిస్తున్న ప్రేక్షకులదే ఈ విజయం వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని ఆర్ నారాయణమూర్తి తనదైన స్టైల్లో అన్నారు. నాగార్జున గారు ఆల్ రౌండర్. అన్నమయ్య, రామదాసు చిత్రాలతో జన్మను ధన్యం చేసుకున్నారు. ఈ విజయం ఆయనది అని చెప్పారు ఆర్ నారాయాణ మూర్తి.
అటు నాగ చైతన్యను కూడా పొగడ్తలలో ముంచెత్తారు. నాగ చైతన్య ఇంత బాగా చేస్తాడని అనుకోలేదు. అద్బుతంగా నటించారు. క్లైమాక్స్‌లో మీ నటనకు ఏడ్చాను. తండ్రికి లేఖ రాస్తారు కదా.. ఆ సీన్ అద్బుతంగా అనిపించింది. సినిమాలో కుటుంబ విలువలు చూపించారు. బతికుండగానే హాయిగా బతికుండండి.. అని సందేశాన్ని ఇచ్చారు. అందుకే ఈ చిత్రం బీభత్సంగా ఆడుతోంది అని చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి
ఫైనల్ గా బంగార్రాజు హీరోయిన్ కృతి శెట్టిపై సరదా కామెంట్స్ చేశారు ఆర్ నారాయణమూర్తి. ఏయ్ పాప అంటూ కృతి శెట్టిని సంబోదిస్తూ.. ఉప్పెన బ్లాక్ బస్టర్ అయింది.. శ్యామ్ సింగ రాయ్ బ్లాక్ బస్టర్ అయింది.. ఇప్పుడు బంగార్రాజు బ్లాక్ బస్టర్ అయింది.. ఏయ్ పిల్లా ఒక సారి లేచి నిలుచో అని ఆర్ నారాయణ మూర్తి నవ్వులు పూయించారు. అంతే కాదు కృతి శెట్టి గురించి ఆయన ఏకంగా ఓ పాట కూడా పాడి అందరిని ఆశ్చర్యపరిచారు.