ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఆర్ ఆర్ ఆర్. అన్ని అనుకున్నట్లు జరిగితే.. జనవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ఒమిక్రాన్ భయం, పెరుగుతున్న కరోనా కేసుల ఫలితంగా దేశ వ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉండటంతో.. మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం విడుదలను వాయిదా వేశారు. దీనిపై చెర్రీ, తారక్ అభిమానులే కానీ సినీ ప్రియులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా.. ఇప్పటికే విడుదలైన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్, సాంగ్స్ నెట్టింట్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మాస్ అంతిమ్ నాటు నాటు పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
ఇది కూడా చదవండి : RRR మూవీ ప్రమోషన్ కోసం అన్ని కోట్లా.. ఇప్పుడు అంతా వృధానేనా
సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. దీనిలో తారక్, చెర్రీ డ్యాన్స్ స్టెప్పులతో పాటు వారి మధ్య ఉన్న బాండింగ్ కూడా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా.. ఓ స్టార్ హీరోకు మాత్రం.. వీరిద్దరిని చూసి అసూయ కలుగుతుందట. మిమ్మల్ని చూసి నేను కుళ్లుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను చూసి తనకు అసూయ కలిగిందంటూ ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ట్వీట్ చేశాడు. నాటు నాటు పాటలో చరణ్, తారక్ వేసిన స్టెప్పుల వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇందులో వారిద్దరి స్నేహం.. సమన్వయం నాలో ఈర్ష్య కలిగిస్తుంది. వారిద్దరిని అలా చూస్తుంటే నాకు అసూయ కలుగుతోంది. అయినా మీ ఇద్దరి పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. హ్యాట్సాఫ్’ అంటూ ట్వీట్ చేశాడు మాధవన్.
ఇది కూడా చదవండి : RRR వాయిదా పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మీమ్స్ తో సెటైర్లు
#NaatuNaatu song https://t.co/66uwRR6W0c via @YouTube —I can get over this video.. it’s simply extraordinary ordinary. The camaraderie between @tarak9999 and @AlwaysRamCharan makes me sooo Jealous . I am imploding with https://t.co/Z6UWRxq7Fo proud of you both-HATS OFF ❤️❤️❤️
— Ranganathan Madhavan (@ActorMadhavan) January 4, 2022
మాధవన్ ట్వీట్ కు ఆర్ ఆర్ ఆర్ టీం స్పందిస్తూ.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. అనంతరం మాధవన్ ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను ఉద్దేశిస్తూ.. ‘మీరు భారత్ లో బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగరాయబోతున్నారు’ అని ట్వీట్ చేయగా… దానికి ఆర్ ఆర్ ఆర్ టీం.. ‘మేం సిద్ధంగా ఉన్నాం సార్.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం. దేశంలోని నెలకొన్న సమస్యలు అతి త్వరలోనే చక్కబడతాయని ఆశిస్తున్నాము’ అంటూ మాధవన్ ట్వీట్ కు బదులిస్తూ.. రీట్వీట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్ సంభాషణ నెట్టింటగా వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీంగా, చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనున్నారు. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మాధవన్ ప్రశంసలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
❤️ Thank you Maddy Sir!! #RRRMovie https://t.co/lMtJHFRQcp
— RRR Movie (@RRRMovie) January 4, 2022
❤️ Thank you Maddy Sir!! #RRRMovie https://t.co/lMtJHFRQcp
— RRR Movie (@RRRMovie) January 4, 2022
❤️ Thank you Maddy Sir!! #RRRMovie https://t.co/lMtJHFRQcp
— RRR Movie (@RRRMovie) January 4, 2022