ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ.. డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన కలెక్షన్లను రాబడుతోంది. మాస్ అంశాలతో నిర్మించిన పుష్ప అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే విధంగా విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్స్ పరంగా మంచి నెంబర్ నమోదు చేసింది.
ఇప్పటికే హిందీ మార్కెట్‌లో రూ.55 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజా నివేదిక ప్రకారం.. పుష్ప మూవీ ఎక్సపెక్ట్ చేసిన దానికంటే ముందుగానే OTT రిలీజుకి రెడీ అవుతోంది. ఈ నెల(జనవరి) 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుందట. దీనికి సంబంధించి అమెజాన్ ప్రైమ్ నుండి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఈ సినిమాలో మలయాళ అగ్రనటుడు ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మరి త్వరలోనే పుష్ప సినిమా సీక్వెల్ (పుష్ప: ది రూల్) ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందట. అయితే విడుదలైన నెల రోజుల్లోనే పుష్ప రాజ్ OTT రిలీజ్ అనే విషయం ఆశ్చర్యంగానే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం అప్పుడేనా! అంటున్నారు. మరి పుష్ప OTT రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.