ఫిల్మ్ డెస్క్- దెయ్యం పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు దెయ్యాలు ఉన్నాయా.. లేవా అన్నదానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే దెయ్యాలను చూశామని చాలా మంది చెబుతుంటారు. కొన్ని సందర్బాల్లో దెయ్యాలకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏదేమైనా దెయ్యం అంటేనే అది అంతు చిక్కని అంశం. దెయ్యాలు ఉన్నాయని నమ్మాలో.. లేవో ఎవ్వరికి తెలియదు. ఏదేమైనా దెయ్యం అంటే మాత్రం అందరికి భయమే. మరి అలాంటిది దెయ్యంతో సహజీవనం అంటే.. అమ్మో వింటేనే చెమటలు పడుతున్నాయి కదా. కానీ ప్రముఖ వివాదాస్పద సినీ నిర్మాత నట్టి కుమారు కూతురు ఏకంగా దెయ్యంతో సహజీనం చేస్తోంది.
అదేంటీ.. ఆయలు ఆ అమ్మాయికి ఏమయ్యింది అని ఆలోచిస్తున్నారా.. ఐతే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే. అసలేం జరిగిందంటే.. నిర్మాత నట్టి కుమార్ చాలా రోజుల తరువాత ఓ సినిమా తీయబోతున్నారు. ఆ సినిమాకు ఈ సారి తానే దర్శకత్వం వహిస్తున్నారు నట్టి కుమార్. ఇక ఈ సినిమాలో నట్టి కుమార్ తన కూతురు కరుణను మెయిన్ రోల్ లో నటింపజేస్తున్నారు. ఇక ఈ సినిమా పేరు డీఎస్ జే. అంటే దెయ్యంతో సహజీవనం అన్న మాట. చదువులో గోల్డ్ మెడల్ సాధించిన ఒక తెలివైన అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారన్నదే ఈ సినిమా కధ. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్నకోణంలో దెయ్యంతో సహజీవనం సినిమాను తెరకెక్కిస్తున్నారట. నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టి కుమార్ కూతురు నట్టి కరుణ లీడ్ రోల్ లో నటిస్తుంది.
ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 12న దెయ్యంతో సహజీవనం సినిమా లోని మొదటి పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నారు.ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ప్రధాన పాత్రలో తన కూతురు నట్టి కరుణను నటింపజేస్తున్నామని నట్టి కుమార్ తెలిపారు. మొదటి నుండి తన కూతురు నట్టి కరుణ ఆర్టిస్టుగానే కాకుండా గతంలో తను చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిందని ఆయన చెప్పారు.