ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి వివాదం చిలికి చిలికి గాలి వాన అవుతోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు, విమర్శలు గుప్పించారో, అప్పటి నుంచి వైసీపీ నేతలకు, పవన్ కు మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. ఈ వ్యవహారంలోకి పోసాని కృష్ణమురళి ఎంటరై పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ఇక పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ వ్యపహారంపై టాలీవుడ్ ప్రముఖులు భహిరంగంగానే స్పందిస్తున్నారు. ఓ వైపు జనసేన కార్యకర్తలు, మరో వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని కృష్ణమురళి మాట్లాడిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా పోసానితో పలు సినిమాలు నిర్మించిన ఓ నిర్మాత ఆయనపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు.
గతంలో పోసాని కృష్ణ మురళి నటించిన మెంటల్ కృష్ణ, రాజవారి చేపల చెరువు సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేసి, ఆ తర్వాత 2010లో పోసాని జెంటిల్మెన్ అనే సినిమాను నిర్మించిన నల్లం శ్రీనివాస్ తాజాగా పోసానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానిపై మాటల్లో చెప్పలేని పదజాలం వాడుతూ పవన్ కళ్యాణ్‌కి మద్దతు పలికారు. పోసాని జెంటిల్మన్ సినిమా సమయంలో తనను దారుణంగా మోసం చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు నల్లం శ్రీనివాస్. మంచి సినిమా చేస్తానని మాటిచ్చి, డీ గ్రేడ్ సినిమా తీసి తన చేతిలో పెట్టాడని, నీలాంటి వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు అంటూ మండిపడ్డారు.
నాలాంటోళ్ళు ఎంత మంది దగ్గర డబ్బులు దొబ్బావో చెప్పాలా.. పోసాని జంటిల్మన్ సినిమా షూటింగులో ఎంత మంది అమ్మాయిలతో రాసలీలలు నడిపావో బయట పెట్టాలా.. నా కళ్ల ముందు చేసిన పనుల లిస్ట్ చెప్పనా.. నువ్వు చేస్తే సంసారం.. ఎదుటోడు చేస్తే వ్యభిచారమా.. ఒకప్పుడు నాకు ఏమీ తెలియని సమయంలో నీ దగ్గరకొచ్చి మోసపోయిన ప్రొడ్యూసర్‌ని నేను.. నీవు నిర్మాతల గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతావా.. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చిగా కొడతా.. అంటూ నిర్మాత నల్లం శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యానించారు.