దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ల ఇష్యూ ఇంక కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేట్లు లేదు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘డేంజరస్’. దీన్ని తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో విడుదల కానుంది. మే 6 విడుదల కావాల్సిన ఈ చిత్రంపై తాజాగా మరోసారి కోర్టు స్టే విధించింది. తనకు ఇవాల్సిన డబ్బులు ఇచ్చిన తరువాత సినిమాను రిలీజ్ అయ్యేలా చేయాలని నిర్మాత నట్టి కుమార్ రెండో సారి కోర్టులో పిటిషన్ వేశాడు. గతంలోను ఓ సారి ఈ సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టీవీతో నెలకొన్న వివాదం పై పలు విషయాలను నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆ హీరో చేతబడి చేసి నాతో శృంగారం చేయించాడు: నటి ఆవేదన!
నట్టి కుమార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మా ఇష్టం సినిమా రెండో సారి ఆగింది. రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో లేడు. అందుకే అప్పులు కట్టకుండా టైమ్ పాస్ చేస్తున్నాడు. అందుకే కోర్టు కూడా ఇద్దరి వాదనలు విని.. సినిమాపై స్టే ఇచ్చింది. నా అప్పులు తీర్చి ఈ సినిమా విడుదల చేసుకోవచ్చు. ఈ చిత్రం కూడా ఆర్టీవీ, నిర్మాత రామ్ సత్యనారాయణలకు సంబంధించిన కథ అని జనాలు చెప్పిన మాటే నేను అంటున్నాను. పరువు నష్టం వేస్తే.. వేసుకోనివ్వండి.. ఎదుర్కొడానికి నేను రెడీగా ఉన్నాను” అని తెలిపారు. ఇప్పుడు నట్టి కుమార్ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.