సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఎలాగైనా జరగవచ్చు. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏమాత్రం మాటలు అటు ఇటు అయినా వెంటనే సోషల్ మీడియా ట్రోల్స్, న్యూస్ లో కథనాలు స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఇలాంటి ట్రోల్స్ కి కొంతమంది దూరంగా ఉండొచ్చు.. మరికొందరు ఫేస్ చేయొచ్చు. అయితే.. ట్రోల్స్ వచ్చినా లైట్ తీసుకొని.. కాంట్రవర్సీలను ఫేస్ చేసేవారు కొందరుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో గతేడాది భీమ్లా నాయక్, డీజే టిల్లు, స్వాతిముత్యం లాంటి హిట్స్ అందుకున్నారు.
ఇప్పుడు బుట్టబొమ్మ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వసిష్ఠ, మెయిల్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా.. మలయాళం ‘కప్పెలా’ మూవీకి రీమేక్ గా రాబోతుంది. ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్ లో మరోసారి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కౌంటర్ వేసి వార్తల్లో నిలిచారు నాగవంశీ. ఇదివరకు పలు ఈవెంట్స్ లో రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు కౌంటర్స్ వేస్తూ ట్రోల్స్ ఫేస్ చేశారు నాగవంశీ. ఇప్పుడు బుట్టబొమ్మ ట్రైలర్ ఈవెంట్ లో మళ్లీ మొహం మీదే కౌంటర్ వేసేసరికి వీడియో వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో రిపోర్టర్ సినిమాకి బుట్టబొమ్మ అనే టైటిల్ ఎలా పెట్టారు? అనే ప్రశ్నకి స్పందిస్తూ.. ‘డిస్కషన్ ఏం లేదు. మా సినిమాలో పాపులర్ అయిన బుట్టబొమ్మ సాంగ్ నే దీనికి టైటిల్ గా పెట్టేశాం. నీకు పాపను చూస్తే బుట్టబొమ్మలా అనిపించట్లేదా? నీకోసం చీరకట్టుకొని రమ్మంటావా ఏంటి? అని సరదాగా కౌంటర్ వేశారు. దీంతో ఇప్పుడు నాగవంశీ మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనికా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. రీసెంట్ గా నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీలో నటించింది. మరి హీరోయిన్ గా ఈ సినిమాతో డెబ్యూ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. మరి నిర్మాత నాగవంశీ రిప్లైపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.