ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంత సంచలనం సృష్టిస్తుందో అదరికి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ, రుకల్ ప్రీత్ సింగ్ లు విచారణకు హాజరయ్యారు. ఈనెల సెప్టెంబర్ 22 వరకు సినీ తారల విచారణ కొనసాగుతూ ఉంటుంది. అయితే మొదటి రోజు పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతుంటే, నిర్మాత బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. బండ్ల గణేష్ రాకతో అతని పాత్రపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఐతే ఆ తరువాత కేవలం పూరికి మద్దతు తెలపడానికి మాత్రమే వచ్చానని, డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్. ఇక ఒకప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన బండ్ల గణేష్, ఆ తరువాత భారీ చిత్రాల నిర్మాతగా మారిన సంగతి అందరికి తెలుసు. అలాంటి బండ్ల గణేష్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా వస్తున్నారు. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.
బండ్ల గణేష్ హీరోగా, వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ, రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవడమే కాదు శరవేగంగా షూటింగ్ కాడూ జరుపుకుంటున్నట్లుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. తమిళ హిట్ ఒత్తు సెరుప్పు సైజ్ 7 చిత్రానికికి రీమేక్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు దర్శక – నిర్మాతలు చెలిపారు. తమిళంలో ఆర్. పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం బండ్ల గణేష్ పత్యేకంగా మేకోవర్ అయ్యారు.
ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్ కానున్నాయట. ఇక ఈ సినిమా షూటింగ్చి శరవేగంగా జరుగుతోంది. నాన్ స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి బడా నిర్మాత బండ్ల గణేష్, హీరోగా ఎంత మేర ప్రేక్షకులను మెప్పిస్తారన్నదే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.