టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్.ఆర్.కళ్యాణ మండపం. ఏంటి.. ఈ హిట్ సినిమాల లిస్ట్ అనుకుంటున్నారా? హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ వరుసగా చేస్తూ వచ్చిన సినిమాలు ఇవి. మాములుగా ఒక్క హిట్ పడితే చాలు. హీరోయిన్స్ కి వరుస పెట్టి ఆఫర్స్ వస్తుంటాయి. ఆ ఊపులో వచ్చిన ప్రతి అవకాశాన్ని కళ్ళు మూసుకుని ఒప్పుకుంటే తక్కవ సమయంలోనే గ్లామర్ డాల్ అనే ముద్ర పడిపోతుంది. కానీ.., ఈ విషయంలో ప్రియాంక జవాల్కర్ తెలివిగా ఆలోచిస్తూ ముందుకి వెళ్తోంది.
టాక్సీవాలా తరువాత వచ్చిన క్రేజ్ ని ఆమె క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆచితూచి సినిమాలను ఎంచుకుంది. ఇందుకే ఇప్పుడు వరుస విజయాలతో దుకుపోతోంది. ఇలా సెలక్టీవ్ గా ముందుకి పోవడంపై ప్రియాంక జవాల్కర్ తాజాగా స్పందించింది. “తిమ్మరుసు, ఎస్ఆర్. కల్యాణమండపం విజయాలు ఆనందాన్ని ఇస్తున్నాయి. టాక్సీవాలా తరువాత సెలెక్టెడ్ ముందుకి వెళ్లడం కలసి వచ్చింది.తిమ్మరుసు తరువాత గ్లామర్ పై కొంత కేర్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యాను. ఇక గమనం సినిమాలో కూడా నా రోల్ బాగా నచ్చింది. స్క్రిప్ట్ బాగుంది కాబట్టి ఈ సినిమాలకి ఒప్పుకున్నాను. ఇకపై కూడా నా పంథా ఇంతే అని ప్రియాంక జవాల్కర్ తెలియచేసింది.
ఇక ప్రశంస అయినా, విమర్శ అయినా తాను ఒకేలా తీసుకుంటానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. “నా సినిమాలకు.. నా ఫ్రెండ్స్ పెద్ద క్రిటిక్స్. కానీ.., ఒక యాక్టర్ గా డైరెక్టర్ చెప్పినట్లు నటించడమే నా లక్ష్యం. వారి వల్లే నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. ఇక పై కూడా ఇలాంటి మంచి చిత్రాలను ఎంచుకునే ముందుకి పోతాను” అని హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తెలియచేసింది.
ప్రియాంక ప్రస్తుతం తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ ఫైనల్ చేసే పనిలో ఉంది. అలాగే.., ఓటీటీ ఆఫర్స్ కూడా ఈ అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా తమిళ్ లో కూడా మరో సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది ఈ లక్కీ బ్యూటీ. ఇలా చేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉండటంతో.. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఒక క్లియర్ అనౌన్స్ మెంట్ ఇవ్వనుందట ప్రియాంక జవాల్కర్. చూశారు కదా? మరి ప్రియాంక జవాల్కర్ జోరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.