పొలిటికల్ డెస్క్- మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తాయి. ఒకరిని మించి మరొకరు పోటీ పడీ మరి వరాలు ఇస్తారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లును ఆకర్షించేందుకు భారీ స్థాయిలో హామీలు ఇస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తామో ప్రకటనలు గుప్పిస్తున్నాయి.
వచ్చే యేడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఈ సారి కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఉత్తర్ ప్రదేశ్ లో తరుచూ పర్యటిస్తూ ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో విధ్యార్ధులకు ప్రియాంక గాంధీ చాలా హామీలు ఇచ్చారు. వచ్చే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటర్ పాసైన బాలికలకు స్మార్ట్ ఫోన్, డిగ్రీ విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రియాంక గాంధి ట్విట్టర్ పోస్ట్ లో ఏంచెప్పారంటే.. బుధవారం కొంత మంది బాలికలను నన్ను కలిశాను.. తమ చదువు, భద్రత కోసం తమకు స్మార్ట్ ఫోన్ అవసరమని వారు చెప్పారు.. ఈ విషయంపై మా పార్టీ మ్యానిఫెస్టో కమిటీతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం.. మేం అధికారంలోకి వస్తే ఈ హామీని నెరవేరుస్తాం.. అని ఆమె చెప్పారు. ఇక ఈసారు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
మరోవైపు తనతో ఫొటో దిగిన మహిళా పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్దమవుతున్నారని ప్రియాంక గాంధి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు వార్తలు వస్తున్నాయని ఆమె ట్వీట్ చేశారు. ఆ మహిళా కానిస్టేబుళ్లు నాతో ఫొటో దిగడమే నేరమా.. ఒకవేళ వారిపై చర్యలు తీసుకుంటే నన్ను కూడా శిక్షించాలి.. నిజాయితీగల మహిళా పోలీసుల కెరీర్‌ను పాడుచేయడం ఈ ప్రభుత్వానికి తగదు.. అని ట్విట్టర్ పోస్ట్ లో వ్యాఖ్యానించారు ప్రియాంక గాంధి.
खबर आ रही है कि इस तस्वीर से योगी जी इतने व्यथित हो गए कि इन महिला पुलिसकर्मियों पर कार्यवाही करना चाहते हैं।
अगर मेरे साथ तस्वीर लेना गुनाह है तो इसकी सजा भी मुझे मिले, इन कर्मठ और निष्ठावान पुलिसकर्मियों का कैरियर ख़राब करना सरकार को शोभा नहीं देता। pic.twitter.com/6wiGunRFEe
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 20, 2021