ఫిల్మ్ డెస్క్- ప్రియాంక చోప్రా.. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కో పరిమితం అయిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యింది. అమెరికా సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన తరువాత హాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది ప్రింయాక. ఇక వివాహం తరువాత నుంచి వీరిద్దరి ఎంజాయ్ మెంట్ గురించి చెప్పక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేసుకుంటూ హాట్ హాట్ గా గడుపుతున్నారు ప్రియాంక, నిక్ దంపతులు.
నిక్ జోనస్, ప్రియాంక చోప్రాలకు ఏ మాత్రం విరామం దొరికినా చాలు జాలీగా సముద్రపు ఒడ్డున గడుపుతుంటారు. ప్రస్తుతం ప్రియాంక నటిస్తున్న వెబ్ సిరీస్ సైటడెల్ కోసం వీళ్లిద్దరు లండన్ కు వెళ్లారు. ఇంకేముంది షూటింగ్ విరామం సమయంలో బీచ్‌లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబందించిన ఫోటోలను ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు యువత హృదయాల్లో వేడిని పుట్టిస్తున్నాయి.
సముద్రపు ఒడ్డున బీచ్‌లో బికినీ ధరించి ఇసుకలో దొర్లుతూ చాలా హాట్‌గా ఫొటోలకు ఫోజ్ ఇచ్చింది ప్రియాంక చోప్రా. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటలను షేర్ చేస్తూ.. పర్ఫెక్ట్ సండే.. స్నాక్స్ అని రాసుకొచ్చింది ప్రియాంక. భర్త నిక్ జోనస్ ఆమె హిప్‌పై చాక్‌తో స్నాక్ పీసెస్ కట్ చేస్తున్నట్లుగా ఫొటో లో కనిపిస్తోంది. ప్రియాంక మాత్రం పడుకుని తన్మయత్వంతో ఉండిపోయింది.
ప్రియాంక, నిక్ జోనస్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చెల్లెలు పరిణీతి చోప్రా ఈ ఫోటోలపై స్పందించింది. ఏం జరుగుతోంది అంటూ.. ఆ ఫొటలపై కామెంట్ పెట్టింది పరిణీతి చోప్రా. ఇక ప్రియాంక, నిక్ జోనస్ హాట్ ఫోటోలపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.