ఫిల్మ్ డెస్క్- సినీ నటుడు. విమర్శకుడు కత్తి మహేష్ చనిపోయి దదాపు మూడు నెలలు గడిచిపోయింది. నెల్లురులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చెన్నై అపోలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి, 10 జులై 2021న చనిపోయారు కత్తి మహేష్. ఇదిగో ఇన్ని రోజుల తరువాత కత్తి మహేష్ మరణంపై అనుమానాలున్నాయని అంటున్నారు కమేడియన్ పృధ్విరాజ్.
కత్తి మహేష్ ఇప్పుడు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ లేని లోటు తెలుస్తుంది.. అటు జర్నలిజంలో కానీ.. ఇటు క్రిటిక్ గా కానీ ఆయన చేసే విమర్శలు అర్థవంతంగా ఉండేవి కానీ.. నేను ఎంచుకున్నదే కరెక్ట్ అని అనేవాడు.. అని చెప్పారు పృధ్వి.
ఓ సందర్బంలో, ఎందుకండీ ఇవన్నీ.. వాళ్లతో మీకు ఎందుకు, విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు కదా అని అడిగానని పృద్వి గుర్తు చేసుకున్నారు. అప్పుడు కత్తి మహేష్.. పృథ్వీ గారూ యుద్ధంలోకి దిగాం.. కత్తితో పోరాడుతున్నాం.. కాసేపు మనం చెట్టుకింద కూర్చున్నాం అంటే.. వచ్చి మన తల తీసుకుని పోతారు.. అందుకే తల వంచడం లేదు అని చెప్పేవాడని.. చెప్పుకొచ్చారు పృధ్వి.
ఇక తాము ఒంగోలులో ఉన్నప్పుడు కత్తి మహేష్ తన రూంకి వచ్చేవాడని చెప్పారు పృధ్వి. అతను చాలా మంచివ్యక్తి అని, ఆయన ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని అన్నారు. వెబ్ సిరీస్ లతో పాటు, ఓటీటీ కంటెంట్, చిన్న చిన్న సినిమాలు కూడా లైన్‌లో పెట్టాడని గుర్తు చేశారు. వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయని కత్తి మహేష్ చెప్పారని, నటుడిగా.. దర్శకుడిగా బిజీ అయ్యే టైంలో కత్తి మహేష్ చనిపోవడం బాధాకరమని పృద్ది అన్నారు.
కత్తి మహేష్ మొదటి నుంచి టార్గెట్ అయ్యాడని, ఆస్పత్రిలో ట్రీట్ మెంట్‌లో ఉండగానే చనిపోయాడని చెప్పారు. అది చాలా దారుణం. కత్తి మహేష్ మరణం ఖచ్చితంగా ఓ మిస్టరీనే అన్న పృధ్వి, కత్తి మహేష్ మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయని, తాను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉంటే స్టడీ చేసేవాడినని సంతలన వ్యాఖ్యలు చేశారు.