న్యూ ఢిల్లీ- అఫ్ఘనిస్థాన్ ను తాలినబన్లు స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో అక్కడి పరిస్థితులను భారత ప్రభుత్వం నిశింతగా పరిశీలిస్తంది. ఇప్పటికే అఫ్ఘాన్ లోని రాయభార సిబ్బందిని, భారతీయులను స్వదేశానికి రప్పించిన కేంద్ర ప్రభుత్వం, తదుపరి పరిణామాలపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అత్యవసరంగా భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈ బేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్ల సహా సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ కూడా కాబూల్ నుంచి వచ్చి, ప్రధాని మోదీ నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను అత్యవసరంగా మన దేశానికి రప్పించగా, ఇంకా అక్కడ ఉన్న మిగతా భారతీయులను ఒకట్రెండు రోజుల్లో తరలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ప్రస్తుతం నిషేదించిన కాబూల్ గగణతలాన్ని తెరవగానే, ప్రత్యేక విమానం ద్వార అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని మోదీ అధికారులను ఆదేశించారు. అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపధ్యంలో, దౌత్యపరమైన జోక్యంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఐతే ఆ వివరాలేవి భహిర్గతం చేయలేదు.