దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రారంభమైన ఓటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సహా.. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించకుంటున్నారు. ఇక ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ తరఫున ద్రౌపది ముర్ము.. బరిలో నిలవగా.. విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేశారు. బ్యాలెట్ పేపర్ తీసుకున్న సీతక్క.. కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్న యశ్వంత్ సిన్హాకు బదులుగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటువేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సీతక్క అడిగారు.
ఎన్నికల అధికారులు ఇచ్చిన బ్యాలెట్‌పేపర్‌పై ఎన్డీఏ అభ్యర్థికి టిక్ చేశారు. ఇది గ్రహించిన ఆమె తాను పొరపాటున తమ పార్టీ అభ్యర్థికి కాకుండా.. ఎన్డీఏ క్యాండెట్‌కి ఓటు వేశానని, మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని ప్రిసైడింగ్ అధికారులను కోరారు. అంతేకాక తన చేతిలోని బ్యాలెట్ పేపర్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయకుండా ఉండిపోయారు. తనకు మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని సీతక్క కోరడంతో.. నిబంధనల ప్రకారం మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్యాలెట్ పేపర్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు.
బయటకు వచ్చిన సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఓటు వేయడంలో ఎలాంటి తప్పు జరగలేదు.. బ్యాలెట్ పేపర్‌పై ఇంక్ పడింది. దాని గురించి అధికారులకు ఫిర్యాదు చేశాను. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అడిగాను. అధికారులు ఇవ్వలేదు. ఇంక్ పడిన బ్యాలెట్ పేపర్‌ను బాక్స్‌లో వేశాను. నా ఆత్మ సాక్షిగా ఓటు వేశాను. ఓటు వేయడంలో ఎలాంటి తప్పు జరగలేదు. కానీ అది చెల్లుతుందా లేదా అన్నది తెలియదు’’ అన్నారు సీతక్క. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.