Prashant Kishor : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికి 2023లో జరగబోయే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో సర్వేలు చేయిస్తున్నారట. ఏఐఎంఐఎంకు చెందిన ఏడు స్థానాలు తప్ప మిగిలిన 112 స్థానాల ఫైనల్ రిపోర్టు ఏప్రిల్ 15లోగా ముఖ్యమంత్రి చేతికి అందనుందట. ఇప్పటివరకు 30 స్థానాలకు సంబంధించి రిపోర్టు వచ్చిందట. ఈ సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయంట. మెజార్టీ స్థానాల్లో సిట్టింగులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయంట.
కేసీఆర్ పట్ల ఇష్టం, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలపై సాఫ్ట్ కార్నర్ ఉన్నా, సిట్టింగుల పనితీరుపై మాత్రం వ్యతిరేకత వ్యక్తం అయ్యిందట. సిట్టింగు ఎమ్మెల్యేలకు బదులు ప్రజలు కొత్త వారిని కోరుకుంటున్నారట. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపై ప్రజలు మండిపాటు వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణలోని 119 ఎమ్మెల్యేలలో 90మంది దాకా ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచిన వారున్నారు. వీరిలో 80 మంది అధికార పార్టీకి చెందిన వారు కావటం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ రిపోర్టులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మంత్రి పదవి పోతే నా విశ్వరూపం చూస్తారు: కొడాలి నాని
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.