యూట్యూబ్.. చాలా మందికి ఇదొక టైమ్ స్పెండింగ్ ప్లాట్ ఫామ్ మాత్రమే. కానీ.., కాస్త కష్టపడి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇందులో కూడా లక్షలు సంపాదించవచ్చు. నిజానికి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చని అందరికీ తెలుసు. కానీ.., ఎలా చేస్తే, అంత సంపాదించవచ్చు అన్న లెక్క మాత్రం చాలా మందికి తెలియదు. కానీ.., తెలుగులో చాలా మంది టాప్ యూట్యూబర్స్ ఇప్పటి వరకు ఈ ప్లాట్ ఫామ్ పై కోట్ల రూపాయలు సంపాదించారంటే మీరు నమ్మగలరా? ఇప్పుడు ఈ విషయాన్ని నిజం చేసే ఓ ప్రూఫ్ ఒకటి బయటకి వచ్చింది.
తెలుగులో టెక్ ఇన్ఫో కావాలంటే మనలో చాలా మంది “ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు” యూట్యూబ్ ఛానెల్ ని ఓపెన్ చేస్తాము. ఆ యూట్యూబర్ ఇచ్చే కంటెంట్ యూజ్ ఫుల్ గా ఉండటంతో కేవలం 5 ఏళ్ళ కాలంలోనే “ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానెల్” మంచి సబ్ స్క్రైబర్స్ ని సొంతం చేసుకుంది. ఇదే సమయంలో ఛానెల్ రీచ్ కూడా పెరిగింది. మరి.., ఈ 5 ఏళ్ళ ప్రయాణంలో “ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ” యూట్యూబర్.. ఆ ఛానెల్ పై ఎంత సంపాదించి ఉంటాడు? కాస్త ఇంట్రెస్టింగ్ విషయమే.. అయితే దీనికి సమాధానంగా ప్రస్తుతం ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు” ఛానెల్ లైఫ్ టైమ్ రెవెన్యూని చూపించే.. ఓ స్క్రీన్ షాట్ అందరికీ షాక్ కలిగిస్తోంది. ఎందుకంటే అందులో ఆ ఛానెల్ లైఫ్ టైమ్ రెవెన్యూ ఎంత చూపిస్తుందో తెలుసా? అక్షరాల 188,758 యూస్ డాలర్స్ . మన కరెన్సీ లో చెప్పాలంటే దీని మొత్తం విలువ కోటి నలభై లక్షల రూపాయలు పైనే. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ఇదంతా కేవలం గూగుల్ ద్వారా వచ్చిన రెవెన్యూ మాత్రమే. ఆ యూట్యూబర్ ఈ 5 ఏళ్ళ కాలంలో మార్కెటింగ్ ప్రమోషన్స్ ద్వారా సంపాదించిన సొమ్ము ఇందుకు అదనం. అయితే.. ఈ స్క్రీన్ షాట్ ఎందుకు బయటకి వచ్చిందన్న వివరాలు తెలియాల్సి ఉంది.