సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో చాలా కొత్త పథకాలను మనకు అందుబాటులోకి తెచ్చింది. దేశ ప్రజలకు ఈ స్కీమ్స్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పథకం “ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మన్ ధన్ యోజన”. ఈ పథకంలో చేరిన వారికి ప్రతి నెలా చేతికి పెన్షన్ లభిస్తుంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. “ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మన్ ధన్ యోజన” పథకం వీధి వర్తకులు, రిక్షా వాళ్లకు, భవన నిర్మాణ కూలీలు మొదలైన వారికి ఉపయోగపడుతుంది. ఇక దీని పూర్తి వివరాల లోకి వెళితే..
18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి రోజుకు రూ.2 ఈ పథకం కింద డిపాజిట్ చేస్తే.. నిర్ధిష్ట వయస్సు అనంతరం నెలకు రూ.3 వేలు లభిస్తాయి. అంటే సంవత్సరానికి రూ.36 వేలు పొందొచ్చు. నెలకు రూ.55 డిపాజిట్ చేయడంతో ఈ స్కీమ్ ని ప్రారంభం చెయ్యచ్చు. 40ఏళ్ల వయసులో వాళ్ళైతే నెలకు రూ. 200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వీరికి కూడా నిర్ధిష్ట వయస్సు పూర్తి అయ్యాక నెలకు రూ.3 వేలు లభిస్తాయి.
ఇక ఈ స్కీమ్ ని ప్రారంభించాలంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీ వయసు 18 ఏళ్ల కంటే తక్కువగా, 40 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నెలవారీ ఆదాయం రూ.10 వేల కంటే తక్కువగా ఉండాలి. ఇక దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ తప్పనిసరి. మరి.. మీరు గనుక ఈ పథకానికి అర్హులు అయితే.. వెంటనే అప్ప్లై చేసుకోండి.