ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. బుట్ట బొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జిల్ మూవీ ఫెమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ వస్తోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు.
రాధే శ్యామ్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్, పాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఈ మేరకు రాధేశ్యామ్ చిత్రం నుంచి.. సంచారి.. వీడియో సాంగ్‌ను గురువారం విడుదల చేశారు.
చలో..చలో.. సంచారి, చల్ చలో.. చలో, చలో.. చలో.. సంచారి, కొత్త నేలపై.. అనే పల్లవితో సాగే ఈ పాటలో ప్రభాస్ లుక్స్, విజువల్స్‌కు విశేష స్పందన వస్తోంది. ఈ పాటలో ప్రభాస్ కొత్తగా కౌబాయ్ గెటప్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. యూరప్‌లోని మంచుకొండల్లో చిత్రీకరించిన దృశ్యాలు, విజువల్స్ ఎంతో గ్రాండియర్‌గా ఉన్నాయి. ప్రస్తుతం సంచారి పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన గంటలోపే వన్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
కాగా ఈ పాటను తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆలపించిగా కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు సమకూర్చారు. సంక్రాతి సందర్బంగా జనవరి 14న రాధే శ్యామ్ విడుదల అవుతుండగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.