హైదరాబాద్- పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన తాజాగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోంచి ఓ పాటను విడుదల చేశారు. ఐతే అనూహ్యంగా ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది. బీమ్లా నాయక్ లోని ఈ పాటలోని కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలోని పదాలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయంటూ హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ట్వీట్ చేశారు.
తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు.. తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టం.. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.. అంటూ రమేష్‌రెడ్డి ట్వీట్ చేశారు. గురువారం ఉదయం బీమ్లానాయక్ మూవీ నుంచి పాటను విడుదల చేయగా, రికార్డ్ స్థాయిలో సుమారు 60 లక్షలకు చేరువలో వ్యూస్‌లు వచ్చాయి.
పోలీసులను కించపరిచేలా పాటలో ఉన్న కొన్ని పదాలను వాడారాన్నది తెలంగాణ పోలీసుల అభ్యంతరం. ఇక సోషల్ మీడియాలో భీం భీం భీం భీం భీమ్లానాయక్ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చెయగా, భీమ్లా నాయక్ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు.
థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ కలిసి ఈ పాట పాడారు. ఇక తెలంగాణ పోలీసుల ట్వీట్ కు పవన్ కల్యాణ్ అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు. కొంత మంది సమర్ధిస్తుంటే, మరికొంత మంది విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s
— M. Ramesh IPS (@DCPEASTZONE) September 2, 2021