ఇంటర్నేషనల్ డెస్క్- బ్రిట్నీ స్పియర్స్.. ప్రపంచ ప్రఖ్యాత గాయని. ఆమె పాట అంటే అభిమానులు చెవులు కోసుకుంటారు. బ్రిట్నీ స్పియర్స్ గొంతు మాత్రమే కాదు, ఆమె కూడా మంచి అందగత్తే. అభిమానులు ఆమె పాటలతో పాటు ఆమెను కూడా ఆరాధిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రిట్నీ స్పియర్స్ కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతో హుషారుగా, అందంగా పాడే బ్రిట్నీ జీవితంలో చీకటి కోణం ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమెను చూస్తే ఎవరైనా ఐశ్వర్యంతో జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తోందని అనుకుంటారు. కానీ తన జీవితం అంతా కన్నీటి పర్వంతం అని చెబుతోంది బ్రిట్నీ.
ఈ పాప్ సింగర్ ముఖంలో నవ్వులన్నీ తెర ముందేనని, ఆమె జీవితం కారు చీకట్లమయమని ఈ మధ్యే బహిర్గతం అయ్యింది. ఈ 39ఏళ్ల పాప్‌సింగర్ ఓ పంజరంలో బందీగా ఉన్న చిలుక అనంటే నమ్మశక్యం కావడం లేదు. 2006లో బ్రిట్నీ స్పియర్స్ తన భర్త కెవిన్‌తో విడాకులు తీసుకున్నారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విడిపోయిన రెండేళ్లకు తన వ్యవహారాలను చూసుకునే బాధ్యతను పూర్తిగా తండ్రి జేమీకి అప్పగించారామె. ఐతే తనను తండ్రి, ఆయన సహాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బ్రిట్నీ చెప్పింది. తండ్రి చెప్పిందే తాను చేయాల్సి వస్తోందని,లేదంటే తనను హింసిస్తున్నారని, తండ్రి చెరలో తాను బానిసగా మారానని కన్నీళ్లు పెట్టుకుందీ పాప్ సింగర్.
తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణను తండ్రి జేమీ స్పియర్స్ చేతుల్లో పెట్టి 13ఏళ్లుగా నరకం అనుభవిస్తున్న స్పియర్స్ ఎట్టకేలకు తన మనసులోని ఆవేధనను బయటపెట్టింది. తన జీవితం, తన డబ్బు అయినా అడుగడునా అంక్షలు, నియంత్రణలో బతికింది. ఆమె స్నేహితులను కలిసే వీలుండదట, ఇష్టపడినవారితో సరదాగా కబుర్లు చెప్పుకునే అవకాశం ఉండదు, మనసుకు నచ్చినవాడితో డేటింగ్ చేసే చాన్స్ లేదు, వెరసి ఆమె జీవితం పంజరంలో చిరకగా మారిందని ఆవేధన వ్యక్తం చేసంది.
మత్తులో ఉండేందుకు తనకు బలవంతంగా ఇంజక్షన్లు ఇచ్చేవారని, తనకు బట్టలను మార్చుకునే ప్రైవసీ కూడా ఉండేది కాదని వాపోయింది బ్రిట్నీ. తన కారును తాను నడుపుకొనే స్వేచ్ఛ కూడా లేకుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆవేధన వ్యక్యం చేసింది. మళ్లీ పిల్లలు కలిగేందుకు ఇప్లాంట్‌ను తొలగించుకునేందుకూ అనుమతించలేదని ఆమె మండిపడింది. ఇన్నేళ్లు జరిగింది చాలు.. నా జీవితాన్ని నాకిచ్చేయండి అంటూ ఆమె న్యాయూమూర్తి ఎదుట తన పరిస్థితిని చెప్పుకొచ్చింది. తన ఆవేదననంతా 20 నిమిషాల పాటు వీడియోలింక్ ద్వారా న్యాయమూర్తికి ఆమె వివరించింది.