ఫిల్మ్ డెస్క్- పూనమ్ కౌర్.. పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే టాలీవుడ్ లో ఓ హీరోయిన్ ను ఓ హీరో మోసం చేసి, ఆమెకు ప్రెగ్నెన్సీ చేసి, ఆ తరువాత బెదిరించి ఆమెకు అన్యాయం చేశాడని ఆరోపించారో.. అప్పటి నుంచి పూనమ్ కౌర్ ఏదో చెప్పాలని అనుకుంటుంది. కానీ ఏంచెప్పలేకపోతోంది. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఓ అంశంపై పోస్ట్ మాత్రం పెడుతోంది.
వారం రోజుల క్రితం మా ఎన్నికలపై కూడా పూనమ్ కౌర్ స్పందించింది. ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్టు పూనమ్ ప్రకటించింది. ప్రకాష్ రాజ్ గెలిస్తే తాను ఇన్నాళ్లు ఎవ్వరికీ చెప్పని, చెప్పుకోలేని, అనుభవించిన బాధలను బయటపెడతానని పూనమ్ కౌర్ చెప్పడం ఆసక్తిరేపింది. పూనమ్ కౌర్ చేసిన ఆ ట్వీట్ పై ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ఇదిగో ఇప్పుడు పూనమ్ కౌర్ మళ్లీ ఓ ట్వీట్ చేసింది. ఈ సారి ట్వీట్‌లో అక్కినేని నాగార్జున గురించి చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ఇంతకీ ఆమె ఏంచెప్పిందంటే.. డిగ్నిటీ గ్రేస్, దయ ఉన్న మంచి మనుషుల్లో నాగార్జున సర్ ఒకరు.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలి.. అని ట్వీట్ లో పేర్కొంది. ఈమేరకు నాగార్జునతో కలిసి ఉన్న ఫోటోను సైతం పోస్ట్ చేసింది పూనమ్. అన్నట్లు ఈ ఫోటోలో ప్రకాష్ రాజ్ సైతం ఉన్నారు.
నాగార్జున గగనం సినిమాలో పూనమ్ కౌర్ నటించింది. అప్పటి పరిచయాన్ని పూనమ్ కౌర్ ఇప్పుడు గుర్తుకు చేసుకున్నట్టుంది. మరి సమయం, సందర్బం ఏంటో తెలియదు గానీ, నాగార్జున గురించి పూనమ్ కౌర్ కొన్ని విషయాలు చెప్పేసింది. అసలు పూనమ్ కౌర్ ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు పోస్ట్ చేసిందా అని అంతా ఆలోచనల్లో పడ్డారు. ప్రకాష్ రాజ్ ఫోటో పోస్ట్ చేయడంతో మా ఎన్నికల ప్రమోషన్ చేస్తోందా అని కొందరు భావిస్తున్నారు. మరి పూనమ్ ఉద్దేశ్యం ఏంటోనని చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు.
Nagarjuna sir , one of the most humble human beings with aura of dignity ,grace and concern .
May god bless his family with abundant love .#peace pic.twitter.com/wVKwFE8uLa
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 8, 2021