సినిమాలతో కన్నా కూడా వరుస వివాదలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు నటి పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయం గురించి అయినా సరే.. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంది. కొన్ని సారు ఆమె పెట్టే పోస్టులు జనాలను కన్‌ఫ్యూజ్ చేసి, తికమక పెట్టేవి. ఆఖరికి ఇలాంటి పోస్టుల విషయంలో కూడా పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చేది కాదు. దాంతో జనాలు తమకు ఏది తోస్తే.. అది ఊహించుకునేవారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ ఇదే రీతిలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అయితే ఈ సారి మాత్రం పూనమ్ కౌర్ తన పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. జరిగిన డ్యామేజ్ చాలు రా బాబు.. నన్ను బతకన్విండి అంటూ కామెంట్ చేసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: సమంత ‘యశోధ’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది!
కొన్ని రోజుల క్రితం పునమ్ కౌర్.. తన సోషల్ మీడియాలో ఇద్దరు చిన్నారులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మై హ్యాపినేస్ అనే క్యాప్షన్‌ని జత చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారడమే కాక.. పూనమ్‌కి వివాహం అయ్యింది.. ఇద్దరు పిల్లలున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై పూనమ్ కౌర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. తనతో పాటు ఫోటోలో ఉన్న పిల్లలు ఎవరో చెప్పింది.
ఇది కూడా చదవండి: దంగల్ రికార్డులు బ్రేక్.. కొనసాగుతున్న KGF-2 కలెక్షన్స్ సునామి!
ఈ సందర్భంగా పూనమ్ కౌర్.. ‘‘ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ చాలు.. ఇక ఆపండి. ఈ చిన్నారులిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు ధన్యవాదాలు. ఇలాంటి వార్తలకు నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నాపే.. నన్ను బతకనివ్వండి’’ అంటూ తన పోస్ట్‌పై వచ్చిన వార్త క్లిప్‌ని షేర్ చేసింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఇది కూడా నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Enough unbearable damage has been done , these are my best friends kids. Thankful to social media , that I can give clarity. 🙏
Let me breathe🙏 pic.twitter.com/4yyCPMuRDn
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 4, 2022
ఇది కూడా చదవండి: Devi Nagavalli: 2 రోజులు తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చున్నాను: దేవి నాగవల్లి