ఫిల్మ్ డెస్క్- బుట్టబొమ్మ పూజా హెగ్డే ముంబైలో లగ్జరీ ఇంటిని కట్టేసిన సంగతి తెలిసిందే. తన కొత్త ఇంటి గృహ ప్రవేశం కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది. సుమారు ఏడాది నుంచి తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటూ ఇంటిని నిర్మించుకుంది పూజా హెగ్డే. ఇదిగో ఇప్పుడు కొత్త ఇంట్లోకి ఓ టీవీని తీసుకొచ్చింది.
సోనీ కంపెనీకి చెందిన ఈ టీవీని ఆన్ చేస్తూ పూజా హెగ్డే మురిసిపోయింది. జెడి మైండ్ ట్రిక్స్ ఇందులో ఉన్నాయి.. కానీ బిగ్ స్క్రీన్ మీద ఈ రాత్రి ఏం చూడాలో మేం నిర్ణయించాం.. సోనీ బ్రేవియా 85 ఇంచెస్ టీవీలో సినిమాను చూడబోతోన్నాం.. సౌండ్, కలర్ అద్బుతంగా ఉన్నాయి.. నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అంటూ పూజా హెగ్డే తన కొత్త టీవీ గురించి చెప్పుకొచ్చింది.
పూజా హెగ్డే కోలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు అన్ని భాషల్లో నటిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా అగ్ర హీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలతో పూజా హెగ్డే అలరించబోతోంది. టాలీవుడ్ లక్కీ చార్మ్‌గా పూజా హెగ్డేను పిలుస్తున్నారు.
అన్నట్లు పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్లు తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక ఈ బుట్టబొమ్మ చేతిలో ఇప్పుడు సుమారు 8 సినిమాలు ఉన్నాయట. మరికొన్ని సినిమా కధలు ఫైనల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అంటే దాదాపు పదేళ్లకు సరిపడ సినిమాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే.