ఓ వివాహిత డయల్ 100కి కాల్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన డయల్ 100 సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అడ్రస్ ను తెలుసుకుని నిమిషాల్లో ఆమె ఇంటికి వెళ్లి ఆమెను కాపాడారు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అంతేకాకుండా ఆ సమయంలో ఆ వివాహిత డయల్ 100కి కాల్ చేసింది. వెంటనే స్పందించిన డయల్ 100 సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ మహిళను కాపాడారు. అసలేం జరిగిందంటే? సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని ఓ ప్రాంతంలో రేష్మ (24) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు.
ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి ఈ దంపతులు తరుచు గొడవ పడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల కూడా ఆ మహిళ భర్త భార్య రేష్మతో గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ డయల్ 100కి కాల్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని వివరించింది. వెంటనే స్పందించిన డయల్ 100 సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఆమె అడ్రస్ ను తెలుసుకుని నిమిషాల్లో ఆమె ఇంటికి వెళ్లారు.
అప్పటికే ఆ మహిళ ఇంటి తలుపులు పెట్టుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఇక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తలుపులు పగలగొట్టి కొన ప్రాణాలతో ఉన్న ఆ మహిళను కిందకు దించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ ప్రాణాల నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి ఓ మహిళ ప్రాణాలను కాపాడిన పోలీసులను స్థానికులు ప్రశంస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.