భూపాలపల్లి క్రైం- ఎవరైనా తప్పు చేస్తే, ఎవరికైనా అన్యాయం జరిగితే మనం పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ పోలీసులే తప్పు చేస్తే ఇక పరిస్థితి ఏంటి. ఈ మధ్యకాలంలో కొంత మంది పోలీసులు సైతం పెడదారి పడుతున్నారు. ప్రజలకు మంచి చెడులు చెప్పాల్సిన పోలీసులు తప్పుదోవపడుతున్నారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసు వ్యవస్థకే కలంకం తెచ్చింది.
ఓ నిపేత దళిత యువతి కష్టపడి చదువుకుని, ఎస్సై ఉద్యోగాన్ని సంపాదించింది. కఠినమైన శిక్షణను పూర్తి చేసుకుని ప్రొబెషనరీగా విధిల్లో చేరింది. 2020లో ఎస్సైగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకోగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించారు. ఇటీవల ఆమెను మరిపెడ పోలీస్ స్టేషన్ ప్రొబెషనరీ ఎస్సైగా నియమించారు. ఇంకా పెళ్లి కాకపోవడంతో ఆమె పోలీసు స్టేషన్ సమీపంలోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఎస్సై శ్రీనివాస్ రెడ్డి దగ్గర శిక్షణ తీసుకుంటోంది.
ఆమెపై కన్నెసిన శ్రీనివాస్ రెడ్డి సోమవారం రాత్రి సుమారు 12 గంటలకు ట్రైనీ మహిళా ఎస్సైకి ఫోన్ చేసి, నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది, మనం వెంటనే తనిఖీలు చేసేందుకు వెళ్లాలి, వెంటనే రావాలని ఆదశఆలు జారీ చేశాడు. నిజమే కాబోలు అనుకుని వచ్చిన ఆ మహిళా ట్రైనీ ఎస్సైని ఓ ప్రైవేట్ వాహనంలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లాడు శ్రీనివాస్ రెడ్డి. అలా కొంత దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశంలో వాహనం నిలిపివేసి, ట్రైనీ మహిళా ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు శ్రీనివాస్ రెడ్డి.
ఆ యువతి అడ్డుకునేందుకు ప్రయత్నించగా బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పైఅధికారులకు తప్పుడు రిపోర్టు రాసి, సస్పెం డ్ చేయిస్తానని ఆమెను హెచ్చరించాడు. తెల్లవారాక ఆ యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తరువాత మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని కలిసి ఫిర్యాదు చేసింది.
తనకు న్యాయం చేయాలని, లేదంటే ఎస్‌ఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కేసు విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి నియమించారు. ప్రాథ మిక విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ఆ మేరకు ఎస్సై శ్రీనివాస్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సస్పెండ్ చేశారు.