న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అకౌంట్స్ అప్పుడప్పుడు హ్యాక్ అవుతుంటాయి. ఐతే ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్లు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్, కంపెనీల అకౌంట్స్ ను హ్యాక్ చేస్తుంటారు. తాజాగా మన దేశ ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్లు కాసేపు హ్యాక్ చేశారు. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్ది సమయం హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయమే స్వయంగా పేర్కొంది. అయితే హ్యాక్ అయిన కాసేపట్లోనే ట్విటర్ యాజమాన్యం దాన్ని మళ్లీ పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 3.18 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ లో బిట్ కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు.
The hackers posted one tweet and a scam link from the handle.
భారత్ లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం బిట్ కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు 500 పంచుతోందని లింక్‌లు పోస్ట్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని అధికారులతో పాటు ప్రజల్లోను అయోమయం నెలకొంది. ఇది నిజమేనా అని చాలా మంది ఆరా తీయడం మొదలుపెట్టారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన ప్రధాని మోదీ సాంకేతిక బృదం వెంటనే ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లింది.
ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్ అయిందని, ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్‌లు పోస్టులు చేస్తే స్వల్పకాలం పాటు స్పందించవద్దని పేర్కొంది. దీనిపై పీఎంవో అధికారులు వెంటనే స్పందించారు. మోదీ వ్యక్తిగత ట్విటప్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని ట్విటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ట్విటర్ హ్యాకర్లు పెట్టిన పోస్ట్ ను తొలగించింది. ఆ తరువాత ప్రధాని ట్విటర్ అకౌంట్‌ను రీస్టోర్ చేశారు.