న్యూఢిల్లీ- దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, సామాజిక అంశాల్లోను చురుకుగా ఉంటారు. అందులోను సోషల్ మీడియాలో మోదీ చాలా యాక్టీవ్ గా ఉంటారు. తమ కార్యక్రమాలను సంబందించిన అంశాలతో పాటు, దేశంలో జరిగే చాలా విషయాలను ప్రజలతో పంచుకుంటారు ప్రధాని. ఇదిగో ఈ క్రమంలోనే కృష్ణ జింకలకు సంబందించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోదీ.
దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణ జింకలు చెంగుచెంగున ఎగురుతూ రోడ్డు దాటుతున్న వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుజరాత్‌లోని భావనగర్‌లో గల కృష్ణజింకల జాతీయ పార్కులో తీసిన ఈ వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అద్భుతమైన ఈ వీడియోను ప్రధాని మోదీ తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అద్భుతం అనే క్యాప్షన్ తో మోదీ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇది నిజంగా అద్భుత దృశ్యం అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో గుంపులు గుంపులుగా పెద్దసంఖ్యలో కృష్ణజింకలు రోడ్డు దాటుతున్నాయి. బుధవారం రాత్రి ప్రధాని మోదీ ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా పదివేల మంది షేర్ చేశారు. ఈ వీడియోను 72వేల మందికి పైగా లైక్ చేశారు. సుమారు 3వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియో బాగా వైరల్ అవుతోంది.
Excellent! https://t.co/9xxNLllQtP
— Narendra Modi (@narendramodi) July 28, 2021