ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న పెన్షన్ అమౌంట్‌ను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పెన్షన్ అమౌంట్‌ను 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్‌దారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే జనవరి నెలనుంచి పెన్షన్ అమౌంట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 2750 రూపాయలు ఉన్న పెన్షన్ అమౌంట్ జనవరి నెలనుంచి మూడు వేల రూపాయలు అవుతుందని తెలిపారు. ఈ మేరకు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేశారు. కాగా, 2019 ఎన్నికల సమయంలో పెన్షన్ అమౌంట్‌ను 3 వేలు చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పెన్షన్ అమౌంట్‌ను పెంచుతూ వస్తోంది. 2022 సంవత్సరంలో నెలకు 2500 రూపాయలు పెన్షన్ వచ్చేది. 2023 జనవరి 1 నుంచి 250 అమౌంట్‌ను పెంచింది. 2500 ఉన్న పెన్షన్‌కు 250 రూపాయలు కలిపి.. 2750 రూపాయలు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే 2024 జనవరి 1 నుంచి 3 వేల రూపాయలను అందించనుంది.