క్షణికావేషంలో చేసే కొన్ని పనులు వల్ల జీవితాలే నాశనం అయిపోతూ ఉంటాయి. అందమైన జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోతూ ఉంటుంది. ఆవేశంలో చేసిన ఓ పని వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
క్షణికావేషంలో చేసే కొన్ని పనులు వల్ల జీవితాలే నాశనం అయిపోతూ ఉంటాయి. అందమైన జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోతూ ఉంటుంది. అందుకే.. ఆవేశంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తుంటారు. అయితే.. ఇక్కడ ఓ కుటుంబం అంతా కలిసి ఆవేశంలో చేసిన ఓ పని వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకుని ఇంట్లో ఉంటోంది. అయితే కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సంతోష్.. గత 6 నెలలుగా ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లితండ్రులకు చేరవేయడంతో వారు షీ టీమ్స్ ని సైతం సంప్రదించారు.
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా సంతోష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా.. తరుచు స్నేహితులను వెంటపెట్టుకుని ఆ బాలిక గ్రామానికి వస్తూ, పోవడం చేసేవాడు. ఈ విషయంలో పెద్దలు పలుమార్లు హెచ్చరించినా సంతోష్ మాత్రం అదే మొండి వైకిరితో అమ్మాయిపై ఇష్టాన్ని పెంచుకుంటూనే వచ్చాడు. సంతోష్ సైతం ఇంటర్మీడియట్ చదువుతూ ఉండటంతో ప్రస్తుతం సెలవల్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సంతోష్ ఇద్దరు స్నేహితులను తోడుగా తీసుకుని ఆ బాలిక గ్రామంలోకి ప్రవేశిచాడు.ఆ బాలిక ఇంట్లోకి సంతోష్ ప్రవేశించగానే.. ఆమె నాయనమ్మ ఈ విషయాన్ని పసిగట్టి తలుపుకి బయట గడియపెట్టింది. సంతోష్ అక్కడే అడ్డంగా దొరికిపోవడంతో అతని స్నేహితులు అక్కడినుంచి జారుకున్నారు.
బాలిక నాయనమ్మ ఈ విషయాన్ని బాలిక తండ్రి యాదయ్యకి చేరవేయడంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోష్ ని బయటకి లాగి.. అతనిపై మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. ఆ దెబ్బలకు సంతోష్ తాళలేక అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామం నుండి పోలీసులకు సమాచారం అందడంతో ఎస్సై శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక కోసం గ్రామంలోకి వచ్చిన సంతోష్ ఏకంగా ఆమె ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడు? అతనికి తోడుగా వచ్చిన స్నేహితులు ఎవరు అన్న విషయంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రేమ పేరుతో ఆడపిల్లలని హింసించడం నిజంగా క్షమించరాని నేరం. కానీ.., ఇలా నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండానే, తగిన విచారణ జరగకుండానే సంతోష్ ప్రాణాలు తీయడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.