ఇంటర్నేషనల్ డెస్క్- పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్లు వినకపోతే వాళ్లకు చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తుంటారు. పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు కాస్త భయం పెడుతుంటారు పేరెంట్స్. ఐతే ఒక్కోసారి తల్లిదండ్రుల అతి క్రమశిక్షణ కాస్త శృతిమించుతుంటుంది. చైనాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అదేంటో తెలుసుకుందామా..
కమ కూతురు చెప్పింది పెడ చెవిన పెట్టి మరీ మొండిగా వ్యవహరిస్తూ, పెంకిగా తయారైందని చాలా పెద్ద శిక్ష వేశారు తల్లిదండ్రులు. ఏకంగా కూతురిని మనుషులు నివసించిన దీవిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. చైనాలోని షాన్డాంగ్ ప్రావీన్స్ లో టీనేజ్ కు వచ్చిన తమ కూతురు ఏ మాత్రం చెప్పినట్లు వినడం లేదట. ఎంత మంచిగా చెప్పినా మెడిగానే ప్రవర్తించేంది. చదువు పక్కన పెట్టి టీవీ, ఫోన్ తో కాలక్షేపం చేసేదట ఆ ఆమ్మాయి. దీంతో విసిగిపోయిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఏకంగా ఓ నిర్మానుష్య ద్వీపంలో వదిలి వచ్చేశారు.
ఈ క్రమంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన జాలర్లకు ఆ దీవిలో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల అమ్మాయి కనిపించింది. ముందు ఆశ్చర్యపోయినా.. తరువాత విషయం తెలుసుకుని వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బాలిక తల్లిదండ్రులను సైతం అక్కడికి పిలిపించారు. కరెంట్ లేని ఈ దీవిలో గత రెండు రోజులుగా చిమ్మచీకట్లో గడిపానని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది.
కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని ఏడ్చేసింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వెంటనే మీ కూతురిని ఇంటికి తీసుకెళ్లాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. తమ కూతురిలో మార్పు తీసుకురావాలని ఇలా చేశామని, ఇకపై ఇలా జరగనివ్వమని వారు పోలీసులకు వివరణ ఇచ్చారు.