గత కొన్ని రోజుల నుంచి వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ చనిపోతున్నారు. 3 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వ్యక్తుల వరకూ హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. అయితే సోమవారం OU లెక్చరర్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయన మరణంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా గుండెపోటుతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్ లు హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు విడిచారు. అయితే ఇది మరువకముందే తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లెక్చరర్, ఏబీవీపీ మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కడియం రాజు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం తెల్లవారుజామున డాక్టర్ రాజు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆయన అప్పటికే గుండెపోటుతో మరణించారని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అయితే ఇతను గతంలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. అంతేకాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా కూడా రాణించారు. ఇక గుండెపోటుతో డాక్టర్ రాజు మరణించారని తెలుసుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ .. ABVP జాతీయ మాజీ కార్యదర్శి, ఉస్మానియా యూనివర్శిటీ లెక్చరర్ శ్రీ కడియం రాజు అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నతనం నుండే జాతీయ భావాల పట్ల ఆకర్షితుడయ్యారని తెలిపారు. ఏబీవీపీ కార్యకర్త నుంచి జాతీయ కార్యదర్శి స్థాయి వరకు ఎదిగిన ఆయన విద్యార్థి ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి, ఉస్మానియా వర్శిటీలో ప్రత్యేక స్థానం సంపాదించారన్నారు. కడియం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. వరుస గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.