హర్షిత అనే యువతికి ఇటీవల కాలంలోనే తల్లిదండ్రులు ఓ యువకుడితో పెళ్లి చేశారు. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా నలుగురు ఈర్శపడేలా జీవించారు. ఎంతో సంతోషంగా సాగుతున్న హర్షిత జీవితం ఒక్కసారిగా ములుపు తిరిగి ఈ లోకం విడిచి వెళ్లింది. పెళ్లై మూడు నెలల కాకముందే ఆ మహిళ అనుకోకుండా మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రాజేష్‌రెడ్డి అనే యువకుడు ఇటీవల కనిపించకుండా పోయాడు. దీంతో తండ్రి రమణారెడ్డి చుట్టు పక్కల అంతటా వెతికాడు. ఎక్కడ కూడా తన కుమారుడి ఆచూకి దొరకకపోవడంతో ఈ నెల 14వ తేదీన పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాజేష్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పుంగనూరు పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, రమణారెడ్డి, అతని బంధువులతో కలిసి కారులో ఖమ్మం చేరుకున్నారు. అక్కడ రాజేష్‌రెడ్డిని గుర్తించి తీసుకుని తిరిగి పుంగనూరుకు వెళ్తుండగా రాత్రి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. నిద్రమత్తులోనే డ్రైవింగ్ చేస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు రెండోవైపు నెల్లూరు నుంచి ఒంగోలు వస్తున్న లారీని ఢీకొట్టింది.
ఇది కూడా చదవండి: పెళ్లయిన నెలకే నాలుగు నెలల గర్భవతి! షాక్ కు గురైన భర్త.. ఏం చేశాడంటే..