ఈ మద్య కాలంలో పురాతన భవనాలు కుప్పకూలి పోతున్నాయి. భారీ వర్షాల కారణంగా గోడలు నానిపోవడంతో బలహీనంగా మారిపోయి కులిపోతున్నాయి. కొంతమంది తమ పురాతన భవనాలు కూల్చి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు.
గత ఏడాది భారీ వర్షాల కారణంగా పలు పురాతన భవనాలు కూలిపోయాయి. నగరంలో ఇప్పటికే ఇలాంటి భవనాలు గుర్తించి ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతమంది పాత భవనాలు ప్రభుత్వ అనుమతితో కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కొండాపూర్ లో ఓ భవనం కుప్పకూలిపోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
కొండాపూర్ లో ఓ పురాతన భవనం కూలిపోయింది. కొండాపూర్ ప్రధాన రోడ్డు వద్ద భవనం కూలిపోవడంతో అక్కడ ఉన్న జనాలు పరుగులు తీశారు. ఈ ఘటన లో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు స్థానికులు. అయితే సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన చేరుకున్నారు. పురాతన భవనం కూల్చివేశారా? కాంట్రాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ చర్యలకు పాల్పపడ్డారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.