బిజినెస్ డెస్క్– ఓలా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే సరైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఓలా వచ్చిన తరువాత జస్ట్ ఫోన్ లో అలా బుక్ చేసుకుంటే ఇలా క్షణాల్లో క్యాబ్ వచ్చేస్తోంది. ఇప్పుడు ఓలా లేని ప్రయాణం అంటే ఉహించుకోలేని విధంగా తయారైంది. క్యాబ్ లు, బైక్ లకు పరిమితం అయిన ఓలా.. ఇప్పుడు ఈ స్కూటర్ లోకి అడుగుపెడుతోంది.
ఓలా ఈ జులై నెలలోనే ఈ స్కూటర్ ను ప్రారంభించనుంది. వీటికి మద్దతుగా 400 నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది. మొదటి విడతగా తొలి సంవత్సరం ఓలా భారత్ లో వంద నగరాల్లో 5 వేల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఓలా స్కూటర్‌లో ఇన్‌స్టాలేషన్ అవసరం లేని హోమ్ ఛార్జర్ ఉంటుంది. ఓలా యొక్క ఛార్జింగ్ స్టేషన్లు విడిగానే కాకుండా ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, కేఫ్‌లు వంటి ప్రముఖ ప్రదేశాలలో ఏర్పాటు చేయబోతున్నారు.
ఐతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వంటి వివరాలను ఓలా కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. భారత్‌లో కొనుగోలుదారులకు అనువైన ధరకు లభిస్తుందని మాత్రం ఓలా ప్రకటించింది. కానీ 90 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఛార్జింగ్ నెట్‌వర్క్ 75 కిలోమీట్లర్ల పరిధికి 18 నిమిషాల్లో 50 శాతం ఓలా స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.
ఓలా స్కూటర్ లో హోమ్ ఛార్జర్ ఉంటం వల్ల దీనికి ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. అంతే కాదు ఛార్జింగ్ కోసం రెగ్యులర్ వాల్ సాకెట్ లోకి ప్లగ్ చేయడం ద్వారా వినియోగదారులు తమ వాహనాన్ని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఎంచక్కా ఇకపై ఓలా ఈ స్కూటర్ పై తిరిగేందుకు సిద్దంగా ఉండండి మరి.