దేశంలో ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అలా గ్యాస్ లీక్ కావడం, ఆయిల్ లీక్ కావడం.. ఇంకా ఏ ఇతర కారణాలతో అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ మాసాబ్యాంక్ NMDC దగ్గర్లో రోడ్డు పై నుంచి ఓ ఆయిల్ ట్యాంకర్ రోడ్డు మీద నుంచి వెళ్తుంది. అలా వెళ్తుండగా.. అనుకోకుండా ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో రోడ్డు అంతా ఆయిల్ తో నిండిపోయింది.. అక్కడ రోడ్డు పై నుంచి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు.అక్కడ భారీగా ట్రాఫీక్ జాం అయ్యింది. అయితే అక్కడ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో ట్యాంకర్ ని పక్కకు తీసారు.. అలా రోడ్డుపై ఆయిల్ పడి ఉండటం వలన.. దీంతో మెహిదిపట్నం, మాసాబ్యాంక్, లక్డీకాపూల్ మార్గ మధ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందువలన ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోనూ వాహానాలు భారీగా నిలిచిపోవడం వలన.. వాహనదారులు ఇబ్బంది కలగకుండా పక్కవైపు నుంచి వాహానాలను మళ్లించారు.