చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటారు అనేక మంది. రోజా రమణి, శ్రీదేవి, తరుణ్, మీనా, రాశి, షామిలీ, షాలినీ, మహేష్ బాబు, తేజ సజ్జా వంటి వారు చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత వెండి తెరపై తమను తాము నిరూపించుకున్నారు. అయితే కొంత మంది చైల్డ్ ఆర్టిస్టుగా కొనసాగి.. ఆ తర్వాత తెరమరుగవుతున్నారు. విక్రమార్కుడులో నటించిన చిన్నారి గుర్తింది కదా.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే.?
తెలుగు సినిమా పరిశ్రమకు అనేక మంది చైల్డ్ ఆర్టిస్టులు పరిచమయ్యారు. అందులో చాలా మంది చిన్నారులు అనేక సినిమాల్లో నటించి, మెప్పించి, కొంత విరామం తీసుకుని ఆ తర్వాత హీరో, హీరోయిన్లుగా వస్తుంటారు. రోజా రమణి, శ్రీదేవి, తరుణ్, మీనా, రాశి, షామిలీ, షాలినీ, మహేష్ బాబు, తేజ సజ్జా వంటి వారు చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు పొంది.. ఆ తర్వాత వెండి తెరపై కూడా తమ సత్తాను చాటుకున్నారు. ఇంకా కొనసాగుతున్నారు. అయితే కొంత మంది ఒక్క సినిమాతో ఫేమ్ తెచ్చుకుంటారు. అటువంటి వారిలో ఈ చిన్నారి కూడా ఉంది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురుగా నటించి, మెప్పించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆమె పేరు.. ఏం చేస్తుందో.. వివరాలు తెలుసుకుందాం.
తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించింది నేహా తోట. విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురిగా, అమాయకమైన పాత్రలో అద్భుతంగా నటించి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు గానూ ఆమెకు మంచి ప్రశంసలు కూడా అందాయి. అనసూయ, రాముడు, ఆది విష్ణు, ఆర్జీవీ రక్ష, సర్కార్ చిత్రాల్లో నటించింది. నేహా అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించింది. అయితే ఆమె తల్లిదండ్రుల.. నేహా చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసి సెటిల్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు కృష్ణా జిల్లా వాసులని సమాచారం. దాదాపు పదేళ్లకు పైగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఆమె సినిమాల కన్నా చదువుపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎంబీఏ పూర్తి చేసిందట.
అయితే ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిన్నప్పుడు చాలా క్యూట్ లుక్స్ తో అదరగొట్టిన ఈ చిన్నారి.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా చాలా కాలంగా తన ఫోటోలను షేర్ చేస్తూనే వస్తోంది. అయితే ఆమె ఫోటోలను చూసిన కొంత మంది మీరు సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు. సినిమాల నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారని కూడా నెటిజన్లు కామెంట్లు చేయడంతో చదువు పూర్తయ్యాక సినిమా అవకాశాలు రాగానే నటిస్తానని ఆమె చెబుతోంది. ఆమె సినిమాల్లోకి రావాలని భావిస్తున్నట్లు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.