విక్రమ్ తెలుగు పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. 52 ఏళ్ల వయస్సులో కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతుంటారు. ఆయన స్టైల్ కానీ, బాడీ ట్రాన్ఫర్మేమేషన్‌కు చాలా మంది నటీనటులు ఫిదా అవుతుంటారు.
సినిమా కోసం ఎంతటి రిస్కైనా చేసే నటుల్లో ఒకరు విక్రమ్. సినిమా సినిమాకు భిన్నమైన కథాంశాన్ని ఎంచుకోవడమే కాకుండా.. తనను తాను మార్చుకుంటారు. షూటింగ్స్‌లో కూడా రియల్ స్టంట్ చేస్తుంటారు. 52 ఏళ్ల వయస్సులో కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతుంటారు. ఆయన స్టైల్ కానీ, బాడీ ట్రాన్ఫర్మేమేషన్‌కు చాలా మంది నటీనటులు ఫిదా అవుతుంటారు. ఇటీవల పొన్నియన్ సెల్వమ్-2తో అలరించిన విక్రమ్.. ఇప్పుడు తంగలాన్ చిత్రంలో పాల్గొంటున్నారు. అయితే సినిమాల వైపు రాకముందే చావు అంచుల వరకు వచ్చి వెళ్లిన విక్రమ్.. పరిశ్రమలోకి వచ్చాక చాలా కష్టపడ్డారు. తాజాగా మరోసారి ఆయనకు ప్రమాదం జరిగింది.
చియాన్ విక్రమ్‌కు ప్రమాదం జరిగింది. తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనకు పక్క టెముకలు విరిగాయి. అయితే ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న తంగలాన్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ ఈ సినిమాపై ఎక్కడేలేని అంచనాలు క్రియేట్ చేశాయి. విక్రమ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని మేకింగ్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.ఈ సినిమా 19 శతాబ్ధంలోని కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాలో ఏకకాలంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.